కాశీబుగ్గ, అక్టోబర్18: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మా ర్కెట్ మార్కెట్‌కు సుమారు 5వేల పత్తి బస్తాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6380 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి రూ.8010 తో కొనుగోలు చేశారు. కాంటాలు సగం అయ్యాక వర్షం కురిసింది. దీంతో పత్తి బస్తాలు తడిసి ముద్దయ్యాయి. యార్డులోని షెడ్లో వేసుకున్న పత్తి తడువకుండా ఉంది. ఖాళీ స్థలంలో వేసుకున్న పత్తి బస్తాలు సుమారు 2 వేల వరకు తడిశాయి. వాటి కాంటాలు నిర్వ హించేందుకు కరీదు వ్యాపారులు నిరాకరించారు. దీంతో కరీదు వ్యాపారులకు అడ్తి వ్యాపారులు నచ్చజె ప్పి కాంటాలు యథా విధిగా జరిగేలా చేశారు. దీంతో బస్తాకు 500 గ్రాముల నుంచి రెండు కిలోల వరకు తరుగు తీసు కాంటాలు నిర్వహించారు. మధ్యాహ్నం వరకు యార్డులో పత్తి బస్తాల కాంటాలు పూర్తయ్యాయి.