నల్లబెల్లి, అక్టోబర్ 17 : పోడు సర్వేలో తలెత్తుతు న్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జడ్పీ సీఈ వో సాహితీమిశ్ర పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇటీవల జరిగిన సంఘటనలపై కలెక్టర్ ఆదేశాలతో జడ్పీ సీఈవో సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంబందిత అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, వివరాలను సేకరించారు. అనంతరం మండలంలోని కొండాపూర్‌లో నిర్వహిస్తున్న పోడు భూ ముల సర్వే లో పాల్గొని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాల కా లంగా, పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల భూములకు ప ట్టాలందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ 2005 కు ముందు రైతులు పోడు చేసుకున్న భూములను సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు సంబందిత అధికారులు 20 రోజుల్లో భూము ల సర్వే పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. కానీ, ఏజెన్సి ప్రాంతం ఐనందున జీపీఎస్‌లో సిగ్నల్ సమస్యలు ఏర్పడుతున్నందున భూముల సర్వేలో కొంత జాప్య మవుతున్నట్లు తాము గుర్తించామన్నారు. దీనికి సం బందించిన నివేదికను కలెక్టర్‌కు ఇచ్చి సమస్య పరిస్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో కూచన ప్రకా శ్, సర్పంచ్ తిరుపతమ్మ, ఫారెస్టు బీట్ అధికారి సుదర్శన్, కార్యదర్శి రజిత, ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ బీ యాకూబాబు, సభ్యులు ఈసం యాకమ్మ, వీ కన్నయ్య, వీ మీన, కే సుదర్శన్ పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: మండలంలోని ఆకుల తండాలో ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు సోమవారం పో డు భూముల సమగ్ర సర్వే నిర్వహించారు. పోడు రైతులు హక్కు పత్రాల కోసం ఇటీవల దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, పోడు సాగు దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం వాటిని ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా అధికారులు పోడు భూ ముల సర్వే చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీవో చంద్రమౌళి, పంచాయతీ కార్యదర్శులు శ్రీధర్, రవిచంద్ర, కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.