నర్సంపేట రూరల్, అక్టోబర్ 17 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 284 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మండలంలోని పాతముగ్దుంపురంలో వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన బస్టాండ్‌ను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం జీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ వందలాది బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు.
1,92,000మంది పేద విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ మాత్రమేనని తెలిపారు. బీసీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ అందిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే పెద్ది చొరవతో నర్సంపేట నియోజకవర్గంలో మరో బీసీ గురుకులాన్ని మంజూరు చేశామన్నారు. బీసీ బిడ్డలు అన్ని రంగాల్లో ఎదగాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. ఉద్యమకారుడు, యువకుడు పెద్ది నర్సంపేటకు ఎమ్మెల్యేగా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. అనంతరం వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ వేములపల్లి రాజును మంత్రి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలన్నారు.
అనంతరం మంత్రి, ఎమ్మెల్యేను పలువురు సన్మానించారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, నర్సంపేట, చెన్నారావుపేట జడ్పీటీసీలు కోమాండ్ల జయ, బానోత్ పత్తినాయక్, పాతముగ్దుంపురం, చెన్నారావుపేట గ్రామాల సర్పంచ్‌లు సుంకరి లావణ్య, కుండె మల్లయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, వైస్ ఎంపీపీ, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మోతె జైపాల్‌రెడ్డి, బుర్రి తిరుపతి, మాజీ జడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, సుంకరి సాంబయ్య, ఉప సర్పంచ్ మేకల సదయ్య తదితరులు పాల్గొన్నారు.