సొంత ఆదాయం పెంచుకుంటూ ఆర్థిక పరిపుష్టి వైపు అడుగులు వేయాల్సిన గ్రేటర్ ఆ దిశగా దృష్టి సారించడం లేదని విమర్శలు వస్తున్నాయి. కమర్షియల్ నల్లాల క్రమబద్ధీకరణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.కోట్లలో ఆదాయం కోల్పోతోంది. గ్రేటర్ పరిధిలోని అన్ని కేటగిరీల్లో 1,13,715 నల్లాలు ఉన్నాయి. వీటిలో 652 కమర్షియల్ నల్లాలు మాత్రమే ఉన్నట్లు పేర్కొనడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. గృహావసరాల పేరుతో కమర్షియల్‌గా వాడుతున్న నల్లాలను క్రమబద్ధీకరించి ఆదాయాన్ని పెంపొందించుకోవాలని నాలుగేళ్ల క్రితం చేసిన కౌన్సిల్ తీర్మానం బుట్టదాఖలైంది. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో కమర్షియల్ నల్లాలను క్రమబద్ధీకరించి మీటర్లు బిగిస్తే నీటి చార్జీలు పెద ్దమ్తొతంలో వసూలై గ్రేటర్‌కు అదనపు ఆదాయం సమకూరుతుంది.
వరంగల్, అక్టోబర్ 10 : గ్రేటర్ అధికారుల నిర్లక్ష్యం.. రూ.కోట్ల ఆదాయం నీళ్ల పాలవుతోంది. సొంత ఆదాయం పెంచుకుంటూ ఆర్థిక పరిపుష్టి వైపు అడుగులు వేయాల్సిన బల్దియా ఆ దిశగా దృష్టి సారించడం లేదని విమర్శలు వస్తున్నాయి. అధికారుల అలసత్వంతో రూ.కోట్ల ఆదాయానికి గండి పడుతోంది. కమర్షియల్ నల్లాల క్రమబద్ధీకరణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 407 చదరపు కిలోమీటర్లు విస్తరించిన వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో 652 కమర్షియల్ నల్లాలు మాత్రమే ఉన్నాయని అధికారులు చెప్పడం ముక్కున వేలేసుకునే పరిస్థితి నెలకొంది.
వందల సంఖ్యలో కమర్షియల్ నల్లాలు ఉన్నట్లు చెబుతుండడం ఇంజినీరింగ్ అధికారులు నిర్లక్షానికి నిదర్శనం. గృహావసరాల పేరిట నల్లా కనెక్షన్లు తీసుకుని కమర్షియల్‌గా వాడుతున్న నల్లాలను గుర్తించి, వాటిని క్రమబద్ధీకరించి ఆదాయాన్ని పెంపొందించుకోవాలని నాలుగేళ్ల క్రితం చేసిన కౌన్సిల్ తీర్మానం బుట్టదాఖలైంది. కమర్షియల్ నల్లాలను రూ.20 వేల ఫీజుతో క్రమద్ధీకరించాలని తీర్మానం చేశారు. సర్వే ప్రకారం నగరంలో 10 వేల వరకు కమర్షియల్ నల్లాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అంటే కమర్షియల్ నల్లాల క్రమబద్ధీకరణ ద్వారా రూ.కోట్లలో ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో కమర్షియల్ నల్లాలను క్రమబద్ధీకరించి మీటర్లు బిగిస్తే నీటి చార్జీలు పెద ్దమ్తొతంలో వసూలై బల్దియాకు అదనపు ఆదాయం సమకూరుతుంది.
అపార్ట్మెంట్లు, దవాఖానలు, నర్సింగ్ హోంలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, హోటల్స్, బిర్యానీ పాయింట్లు, హాస్టళ్లు, షాపింగ్ మాల్స్, లాడ్జిలు, చికెన్ సెంటర్లు ఇలా అనేక వ్యాపార సంస్థల్లో ఉన్న నల్లాలను కమర్షియల్‌గా గుర్తించాలి. అయితే, అధికారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. గ్రేటర్ పరిధిలో కేవలం 652 నల్లాలు మాత్రమే కమర్షియల్ ఉన్నాయని వాటికి మాత్రమే మీటర్లు బిగించారు.
నగరంలోని నల్లాలను సర్వే చేసి కమర్షియల్‌గా వినియోగిస్తున్న వాటిని కమర్షియల్ నల్లాల కేటగిరీలో క్రమబద్ధీకరించాలన్న గత కౌన్సిల్ తీర్మానం బుట్టదాఖలైంది. నాలుగేళ్ల క్రితం కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీంగా తీర్మానం చేసి ఆమోదం తెలిపారు. సొంత ఆదాయం పెంచి కార్పొరేషన్‌కు ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్న లక్ష్యంతో చేసిన తీర్మానం ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. హడావుడిగా డివిజన్ల వారీగా ఏఈలతో సర్వే చేయించి, సుమారు 25 వేల వరకు కమర్షియల్ నల్లాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే వాటి క్రమబద్ధీకరణలో అడుగు ముందు పడలేదు. నాలుగేళ్ల గడుస్తున్నా ఇంజినీరింగ్ అధికారులు మాత్రం కమర్షియల్ నల్లాల క్రమబద్ధీకరణపై దృష్టిపెట్టడం లేదు.
హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా చెప్పుకుంటున్న గ్రేటర్ వరంగల్‌లో అన్ని కేటగిరీల్లో 1,13,715 నల్లాలు ఉన్నాయి. ఐదు వందలకు పైగా అపార్ట్మెంట్లు ఉన్నాయి. వేల సంఖ్యలో వ్యాపార వాణిజ్య సంస్థలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా 652 కమర్షియల్ నల్లాలు మాత్రమే ఉన్నాయని అధికారులు చెప్పడం వారి పనితీరుకు నిదర్శనం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కమర్షియల్ నల్లాలను క్రమబద్ధీకరించి, ఆదాయం పెంపుపై దృష్టిసారించాలని నగర ప్రజలు కోరుతున్నారు.