నర్సంపేట, అక్టోబర్ 9: ప్రపంచ శాంతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నర్సంపేటలో ముస్లింల ర్యాలీని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఏరియా దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త బోధనలు ఆచరించి ముస్లింలు శాంతియుత జీవనం సాగించాలని కోరారు. ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ స్నేహభావంతో కలిసిమెలిసి జీవించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ పీ గోపాల్, నల్లా మనోహర్‌రెడ్డి, పాషా, యాకూబ్, ఎంవీ రామారావు, ఓంప్రకాశ్, వెంకటనారాయణ, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.
కరీమాబాద్/వరంగల్‌చౌరస్తా/పోచమ్మమైదాన్/మట్టెవాడ: మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకొని ముస్లింలు శంభునిపేటలో ఎంఏ జబ్బార్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అనంతరం శంభునిపేట నుంచి దర్గా వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంఏ జబ్బార్, హసన్ అలీబేగ్, ఫసీ, అస్రఫ్, మాషుఖ్, యాకూబ్ పాల్గొన్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మత గురువుల ఆధ్వర్యంలో వరంగల్ 27, 36వ డివిజన్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యాకుబ్పుర మసీద్‌లో మీసాల ప్రకాశ్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్ 21వ డివిజన్ ఎల్బీనగర్లోని మోమిన్పురలో ముస్లిం లు మిలాద్-ఉన్-నబీని జరుపుకున్నారు. స్థానికులకు అన్నదానంతోపాటు స్వీట్లు పంపిణీ చేశా రు. కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో నవీద్‌బాబా, మతపెద్దలు పాల్గొన్నారు. అలాగే, పోచమ్మమైదాన్ సెంటర్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు. 24వ డివిజన్ ఖాసిందుల దర్గా కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీని ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్(టీఆర్ఎస్) నాయకుడు రాజనాల శ్రీహరి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దర్గా కమిటీ సభ్యు లు శ్రీహరిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అబ్దుల్ అమీద్, ఆరీఫ్, నవాజ్, అలీం పాల్గొన్నారు.