భూపాలపల్లి, అక్టోబర్ 5 : భూపాలపల్లి ఏరియాలో దసరా పండుగను సింగరేణీయులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు గనులు, డిపార్ట్మెంట్ల వద్ద ఉన్న దుర్గామాత మండపాల్లో, జమ్మిచెట్టు వద్ద వేదపండితులు మంత్రోచ్ఛారణతో పూజలు చేశారు.
మహాముత్తారం : మండల వ్యాప్తంగా దసరా పండుగను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. జమ్మి చెట్టుకు పూజలు చేసి ఆకులను కుటుంబ సభ్యులకు అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వాహనాలకు పూజలు చేశారు. పిండి వంటలు చేసుకోని కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
మహదేవపూర్ : మండల కేంద్రంలోని గర్భగౌరీ ఆలయంలో బుధవారం దసరా పండుగ సందర్భంగా శమి పూజ నిర్వహించారు. సర్పంచ్ శ్రీపతిబాపు, అర్చకుడు చంద్రశేఖరశర్మ, ఆలయ కమిటీ సభ్యులు మోతం వెంకటేశ్వర్లు, వడిజే రామకృష్ణ, మేరుగు లక్ష్మణ్, ఆకుల శ్రీధర్, నాగభూషణం పాల్గొన్నారు.
ములుగురూరల్, అక్టోబర్ 5 : విజయదశమి వేడుకలు ములుగు జిల్లా కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఘనంగా జరిగాయి. జమ్మిచెట్టు వద్ద పూజలో పాల్గొని అనంతరం సోరకాయ కొట్టే కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రామాలయం వద్ద జమ్మిచెట్టుకు పూజలు చేశారు.
ఏటూరునాగారం : స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అశోక్‌కుమార్, సీఐ రాజు, ఎస్సైలు రమేశ్, ఇందిరయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
మంగపేట : స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాకులకు సాంప్రదాయ పూజలు జరిపారు. కార్యక్రమంలో ఎస్సై తాహెర్‌బాబా, సిబ్బంది పాల్గొన్నారు.
గోవిందరావుపేట : దసరా సందర్భంగా మండలంలోని పస్రా పోలీస్ స్టేషన్లో సీఐ శంకర్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. వేద పండితుడు లింగరి రంగాచార్యులు ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. పస్రా ఎస్సై సీహెచ్. కరుణాకర్రావుతో పాటు సీఆర్పీఎఫ్, సివిల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఏటూరునాగారం : మండల కేంద్రంలోని జంపన్నవాగు తీరంలోని శమీ పూజ, రావణాసుర వధ ఏర్పాటు చేశారు. 35 అడుగుల ప్రతిమను దహనం చేశారు. ముఖ్య అతిథిగా ఏఎస్పీ అశోక్‌కుమార్ రావణాసురుడు ప్రతిమకు నిప్పంటించారు. కార్యక్రమంలో అర్చకులు సుదర్శన్ శర్మ, సీఐ రాజు, ఎస్సై రమేశ్, బీఆర్ఎస్ నాయకుడు కాకులమర్రి లక్ష్మీ నర్సింహారావు, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, ఉత్సవ కమిటీ కన్వీనర్ ఇర్సవడ్ల వెంకన్న, కో కన్వీనర్ తాడూరి రఘు, సభ్యులు తుమ్మ మల్లారెడ్డి, కుమ్మరి చంద్రబాబు, సప్పిడి రాంనర్సయ్య, మెరుగు వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
వెంకటాపురం (నూగూరు): మండలంలో విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వర్షం కారణంగా ఆలయంలోనే జమ్మి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
భూపాలపల్లి రూరల్ : భూపాలపల్లి మండలంలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, భూపాలపల్లి పట్టణంలోని మంజూర్‌నగర్ 9, 10వ వార్డులో కౌన్సిలర్ బద్ది సమ్మయ్య ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జమ్మి పూజ నిర్వహించి ఆకులను ఒకరికొకరు పంచిపెట్టుకొని దసరా సుభాకాంక్షలు చెప్పుకున్నారు.
టేకుమట్ల : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జమ్మి ఆకులను ప్రధాన కూడలి వద్ద పంచిపెట్టారు. ఎంపేడు వెల్లంపల్లిలో జరిగిన వేడుకలో సినీగేయ రచయిత మిట్టపల్లి సురేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎస్సై చల్లా రాజు ఆధ్వర్యంలో ఆయుధాలు, వాహనాలకు పూజలు నిర్వహించారు.
మొగుళ్లపల్లి : మండల కేంద్రంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను బుధవారం సాయంత్రం నిమజ్జనం చేశారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన రావణవధలో జడ్పీటీసీ జోరుక సదయ్య, ఎంపీపీ యార సుజాత, సొసైటీ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు, సర్పంచులు మోటె ధర్మారావు, చదువు అన్నారెడ్డి, కొడారి సునీత, బెల్లంకొండ మాధవి, నైనకంటి ప్రభాకర్‌రెడ్డి, పెంతల రాజేందర్‌రెడ్డి, కొనుకటి అరవింద్‌రెడ్డి, గాలి చంద్రమౌళి, దానవేన రాములు, మంద సునీల్‌రెడ్డి, నరహరి పద్మ, ఎర్రబెల్లి వనిత, ఎర్రబెల్లి పున్నంచందర్రావు, దండ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.