జాతీయస్థాయిలో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో జిల్లా వ్యాప్తంగా బుధవారం సంబురాలు అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. జాతీయ రాజకీయాల్లో రాణించే సత్తా కేసీఆర్‌కు ఉందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 5 : కేసీఆర్ ప్రగతి భవన్లో బుధవారం బీ(టీ)ఆర్ఎస్ ప్రకటన చేశారు. దీంతో పార్టీ శ్రేణులు ఉత్సాహం గా సంబురాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు భారీ ఎత్తున పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. పట్టణ కేంద్రంలోని నెహ్రూ సెంటర్ నందు మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, సంబురాలను నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ఉన్న బీజేపీ అనేక ప్ర జావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు.
ప్రజలకు మేలు చేయాలంటే కేసీఆర్ బీ(టీ)ఆర్ఎస్ వల్లే సాధ్య అవుతుందన్నారు. కేసీఆర్ వంటి మంచి ఆలోచన కలిగిన నాయకుడు దేశంకు చాలా అవసరం ఉందన్నారు. అందుకే నేడు అన్ని రాష్ర్టాల్లో ఉన్న నాయకులు కేసీఆర్ నాయకత్వంను కోరుకుంటున్నారన్నారు. మోదీ విధానాలతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బీ (టీ)ఆర్‌ఎస్‌తోనే వారికి న్యాయం జరుగుతుందన్నారు. దేశంలో రాణించే సత్తా కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, ప్లోర్ లీడర్ జనార్దన్, వెంకన్న, గద్దె రవి, ఎడ్ల వేణుమాధవ్, బోనగిరి గంగాధర్, పెద్ది సైదులు, శంకర్, మహేందర్, రాజ్‌కుమార్, హరిసింగ్ , శివ, వెంకట్రామ్ పాల్గొన్నారు.
తొర్రూరు: దేశవ్యాప్తంగా తెలంగాణ రోల్‌మోడల్‌గా ప్రజలను కష్టాల కడలి నుంచి గట్టెక్కించి వ్యవసాయాన్ని పండుగలా మార్చాలన్న ధృడ సంకల్పంతో జాతీయస్థాయిలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ దసరా పర్వదినం రోజున ప్రకటన చేయగానే టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబురాలు అంబరాన్నంటాయి. తొర్రూరు డివిజన్ కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా వరంగల్-ఖమ్మం ఎదురుగా పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. గ్రామాల్లో సైతం పార్టీ నేతలు సంబురాలు నిర్వహించారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణా రాష్ర్టాన్ని సాధించుకుని అనతికాలంలోనే దేశంలోనే ఆదర్శవంతమైన అభివృద్ధిని చేసి చూపి కేంద్రం ప్రకటించిన అనేక అవార్డులను కైవసం చేసుకుంటున్న ప్రభుత్వం అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని, నేతలు తెలిపారు. మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ర్టాల ప్రజ లు కేసీఆర్ వంటి నేత నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. విద్యుత్, సాగునీటిరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి వ్యవసాయరంగాన్ని ఊహించని రీతిలో అభివృద్ధి చేసి తెలంగాణాను దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మలిచిన తీరు దేశస్థాయిలోని రైతు సంఘాలను ఆకర్షించిందన్నారు. జాతి సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతూ ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు పెట్టుబడి దారులకు దాసోహం చేస్తున్న మోదీ నిరంకుశ విధానాలకు చరమగీతం పాడేందుకు బీ(టీ)ఆర్ఎస్ స్థాపన జరిగిందని, అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, రామి ని శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రాంచంద్రయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, మండల రైతుబంధు కో-ఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, జిల్లా సభ్యుడు రామసహాయం కిశోర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, గుగులోత్ శంకర్, కుర్ర శ్రీనివాస్, ధరావత్ జైసింగ్‌నాయక్, దొంగరి శంకర్, కర్నె నాగరాజు, బిజ్జాల అనిల్, తూర్పాటి రవి, ఎండీ జలీల్, నకిరకంటి కొమురయ్య, రాయిశెట్టి వెంకన్న, అర్జున్‌రాజు, పాండు, జే సాయికృష్ణ, సురేందర్‌రాజు, ఆశయ్య, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నర్సింహులపేట: తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో రావడంతో పాటు బీ(టీ)ఆర్ఎస్గా ప్రకటించడంతో మండల కేంద్రంలో బుధవారం సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ టేకుల సుశీల, మండల అధ్యక్షుడు మైదం దేవేందర్ మాట్లాడుతూ బీజేపీ కేంద్ర వ్యతిరేక విధానతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. దేశ రైతులకు, కార్మికులకు మేలు జరుగాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కోసం ప్రా ణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమం చేసిన మహా నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావడంతో ప్రజలకే మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జాటోత్ దేవేందర్, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మేర్గు శంకర్‌గౌడ్, గుగులోత్ రవి, సర్పంచ్‌లు, నాయకులు హోలి, సీతారాంనాయక్, సురేశ్, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు అజ్మీరా వంశీ, బాధవత్ కిషన్‌నాయక్, ఉదయ్, వెంకట్‌రెడ్డి ఉన్నారు.
పెద్దవంగర: ప్రత్యామ్నాయం.. చారిత్రక మా ర్పుకే సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచనతో బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్గా మార్పు చేసి దేశంలో సుపరిపాలన అందించాలనే లక్ష్యం తో ముందుకెళ్తున్నారని పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్‌రావు పేర్కొన్నారు. బుధవారం బీఆర్ఎస్ ఏర్పాటుతో మండల కేంద్రంలో వలిగొండ-తొర్రూరు ప్రధాన రహదారిపై పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రావు మాట్లాడుతూ దేశంలో ఎన్నో రాష్ర్టాలు కొత్తగా ఏర్పడినప్పుటికీ భవిష్యత్‌పై.. సరైన అవగాహన స్పష్టత లేదన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటుతో అన్ని విధాలా ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. దశాబ్ధాల రాజకీయ చరిత్రను మార్చే శక్తి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి సభ్యుడు నెహ్రునాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్యశర్మ, మాజీ మండల అధ్యక్షుడు పీ యాదగిరిరావు, ఎంపీటీసీలు శ్రీనివాస్, రవీందర్‌నాయక్, మండల కోఆప్షన్ సభ్యులు ముజీబుద్ధీన్, టీఆర్ఎస్ నాయకులు సుధీర్‌కుమార్, శ్రీనివాస్, రాము, లింగమూర్తి, సత్యనారాయణ, రవి, మల్లికార్జునాచారి, వెంకట్రామయ్య, సోమన్ననాయక్, పటేల్నాయక్, రవి, పూర్ణచందర్, హరీశ్‌యాదవ్, భిక్షపతి, ఉషయ్య, కిషన్‌నాయక్, కార్యకర్తలు ఉన్నారు.
బయ్యారం: అసాధ్యంను సుసాధ్యం చేసి, చరిత్రను సృష్టించే రాజకీయ చాణక్యుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎప్ నాయకుడు ప్రవీణ్ నాయక్ అన్నారు. సీఎం కేసీఆర్ఎస్ బీ(టీ)ఆర్ఎస్గా పార్టీ ప్రకటించగా, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కొత్తపేట, గంధంపల్లి గ్రామాల్లో పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. డైరెక్టర్ భాస్కర్, నాయకులు శ్రీనునాయక్, భద్రం పాల్గొన్నారు.
దంతాలపల్లి: మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి, సంబు రాలు నిర్వహించారు. కేసీఆర్ లాంటి ముందు చూపు ఉన్న గొప్ప నాయకుడు దేశ రాజకీ యాల్లోకి రావడం శుభదాయకమన్నారు. తెలంగాణ రాష్ట్రంను అబివృద్ధి చేసిన విధంగా దేశాని అభివృద్ధి పథంలో నడుపుతారని పూర్తి నమ్మకం ఉందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండలాధ్యక్షుడు పీ బాలాజీ, మిట్టకోల సత్యనారాయరణ, వీరేశ్, ఉమేశ్, చంటి, నాగర్జున తదితరులు పాల్గొన్నారు.