నల్లబెల్లి, సెప్టెంబర్ 28: రాష్ట్రంలోని ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని జడ్పీఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న అన్నారు. మండలంలోని కొండైల్పల్లెలో సర్పంచ్ మామిండ్ల మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం మహిళలకు ఆమె బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వరాష్ట్రంలో పండుగలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలు వేడుకలను ఘనంగా జరుపుకోవాలన్నదే టీఆర్ఎస్ సర్కారు ప్రధాన ధ్యేయమన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ, దసరా పండుగ వేళ నిరుపేదల మహిళల కళ్లల్లో ఆనందం చూసేందుకు సీఎం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని కొనియాడారు. చీరల తయారీని అభినందించాల్సిన ప్రతిపక్ష పార్టీల నేతలు తప్పుడు ఆరోపణలు చేయడం హేయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీత, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, ఎంపీటీసీ జన్ను జయరాజ్, కొనకటి వీరమల్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంగెం/చెన్నారావుపేట/వర్ధన్నపేట/రాయపర్తి/నర్సంపేట రూరల్: ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకే రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందిస్తున్నదని ఎంపీపీ కందకట్ల కళావతి అన్నారు. సంగెం మండలం వంజరపల్లి, నర్సానగర్లో ఆమె చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సర్పంచ్ పెంతల స్రవంతి-అనిల్, ఉపసర్పంచ్లు కాల్వ వెంకటేశ్వర్లు, రాజిరెడ్డి, నాయకులు నల్ల శ్రీనివాస్, సోమిడి శ్రీనివాస్, శంకర్రావు, కార్యదర్శి మందపల్లి శ్రీనివాస్, కారోబార్ రాంచందర్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట మండలంలోని లింగాపురం, 16 చింతల్‌తండాలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తప్పెట రమేశ్, కార్యదర్శులు రాగి రాజ్‌కుమార్, శ్వేత పాల్గొన్నారు. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలో మహిళలకు ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, సర్పంచ్ స్రవంతి-అంజన్‌రావు చీరలు పంపిణీ చేశారు. రాయపర్తి మండలంలోని సూర్యాతండాలో బతుకమ్మ చీరలను జడ్పీటీసీ రంగు కుమార్ సర్పంచ్ మునావత్ అమ్మి- మాంజ్యానాయక్తో కలిసి పంపిణీ చేశారు. టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, మునావత్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కమ్మపల్లిలో జడ్పీటీసీ కోమాండ్ల జయ, సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ చీరలు పంపిణీ చేశారు.
వరంగల్‌చౌరస్తా/ఖిలావరంగల్/గిర్మాజీపేట/పోచమ్మమైదాన్/కరీమాబాద్: బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్రంలోని ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ కానుకలుగా చీరలు అందజేస్తున్నారని డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ అన్నారు. వరంగల్ 36వ డివిజన్ కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె డివిజన్లోని మహిళలకు చీరల పంపిణీని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పద్ధతుల్లో వేల రకాల డిజైన్లతో చీరలు నేయించి చేనేత కార్మికులకు ఉపాధిని సైతం కల్పిస్తున్నదని కొనియాడారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ ప్రజా సంక్షేమంలో దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలుస్తున్నదని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు మసూద్, డివిజన్ అధ్యక్షుడు వేల్పుగొండ యాకయ్య, మహిళా విభాగం నాయకురాలు సమీనా, నీలం నవీన్, రాజారపు అనిల్, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వరంగల్ 17వ డివిజన్ బొల్లికుంటలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ సోల్తీ భూమాత మహిళలకు చీరలు అందించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బొజ్జం సుధాకర్, పార్టీ యూత్ విభాగం డివిజన్ అధ్యక్షుడు సోల్తీ నరేందర్‌గౌడ్, ఆర్పీలు సీహెచ్ సరిత, కే పద్మ, శ్రీలత, మమత, సుజాత, అంకిత, తిరుమల, సమ్మక్క, కవిత, రాము, శ్రీధర్ పాల్గొన్నారు. వరంగల్ 26, 25వ డివిజన్ కార్పొరేటర్లు బాలిన సురేశ్, బస్వరాజు శిరీషా-శ్రీమాన్ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. వరంగల్ 21వ డివిజన్ ఎల్బీనగర్లోని క్రిస్టల్ గార్డెన్లో కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్ చీరలు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలకూ సమప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన కొనియాడారు. వరంగల్ 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ డివిజన్లోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పోశాల స్వామి, ఈదుల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.