నర్సంపేట రూరల్, సెప్టెంబర్18 : మండలంలోని రాజపల్లి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 40 మంది ఆదివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సీనియర్ నాయకులు పసునూరి సదానందం, బరిగెల రాజమౌళి, పసునూరి రాంబాబు, పసునూరి శ్రీను, అశోక్, గణపతి, జంపయ్య, ప్రవీణ్, కుమారస్వామితో పాటు మరో పలువురు ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో పక్కాగా అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఈసందర్భంగా వారు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామాల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు మురాల మోహన్‌రెడ్డి, ఆకుల రమేశ్‌గౌడ్, నాయకులు డాక్టర్ రమేశ్, సుధాకర్, మోతె పద్మనాభరెడ్డి, రవి, రమేశ్, రాజు పాల్గొన్నారు.