బెల్లంపల్లి,ఆగస్టు 20: మందమర్రి ఏరియా నుంచి ఉద్యోగోన్నతిపై కొత్తగూడెం డైరెక్టర్ ఆపరేషన్స్ విభాగంలో జీఎంగా వెళ్తున్న శాంతిఖని గ్రూప్ ఆఫ్ ఏజెంట్ కే.వెంకటేశ్వర్లుకు శనివారం గని ఆవరణలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో ఘనం గా సన్మానించారు. అంతకు ముందు ఓపెన్ టాప్ జీపులో ఫ్యా న్ హౌస్ నుంచి గని షాఫ్ట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విధి నిర్వహణలో తన అనుభూతిని అధికారులు, ఉద్యోగులతో పంచుకున్నారు. గని పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న గనిని లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు ఏజెంట్ పాత్ర కీలకమని వివరించారు. గని మేనేజర్ సంజయ్‌కుమార్ సిన్హా, రక్షణాధికారి పీ రాజు, పిట్ ఇంజినీర్ రాంబాబు, బోల్డర్ మైనర్ ఇన్చార్జి ముస్తాఫా, ఈఎస్‌వో రాంసాగర్, ఇంజినీర్లు ప్రవీణ్, సైదులు, వెంటిలేషన్ అధికారి పూర్ణచందర్, టీబీజీకేఎస్ గని పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, నాయకులు వెంకటరమణ, కొట్టె రమేశ్, శ్రీనివాసా చారి, ఈరబత్తుల ప్రవీణ్‌కుమార్, దాసరి తిరుపతి గౌడ్, దాగం మల్లేశ్, చిప్ప నర్సయ్య, జేఎంస్ ప్రాజెక్ట్ అధికారి బుచ్చయ్య పాల్గొన్నారు.
కాసిపేట, ఆగస్టు 20 : కొత్తగూడెంకు బదిలీపై వెళ్తున్న వెంకటేశ్వర్లును సింగరేణి అధికారులు, కార్మిక యూనియన్ నాయరులు, కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో టీబీజీకేఎస్ ఏరియా కార్యదర్శి వొడ్నాల రాజన్న, మేడ సమ్మయ్య, పిట్ కార్యదర్శులు కారుకూరి తిరుపతి, దుగుట శ్రీ నివాస్, గని అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
రెబ్బెన, ఆగస్టు 20: ఉద్యోగులకు బదిలీలు సహజమేనని బెల్లం పల్లి ఏరియా డీజీఎం(సివిల్) సతీశ్‌బాబు అన్నారు. బెల్లంపల్లి ఏరియాలో డీవైఎస్ఈగా విధులు నిర్వహిస్తున్న రాము శ్రీ రాంపూర్ ఏరియాకు బదిలీ కాగా, జైపూర్ పవర్ ప్లాంట్‌లో వి ధులు నిర్వహిస్తున్న ఈఈ శ్యామల బెల్లంపల్లి ఏరియాకు వచ్చారు. వీరిని శనివారం ఘనంగా సన్మానించారు. ఈఈ రాజేంద్రప్రసాద్, కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ము క్కు గోపిరెడ్డి, సివిల్ సూపర్వైజర్లు, సివిల్ కార్యాలయం ఉ ద్యోగులు, కాంట్రాక్టర్లు ఉన్నారు.