వరంగల్, ఆగస్టు 19: గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయ కౌన్సిల్హాల్లో పన్నుల విభాగం అధికారులతో శుక్రవారం ఆమె పన్నుల వసూళ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాభివృద్ధి పన్నుల వసూళ్లపై ఆధారపడి ఉన్నదని అన్నారు. ఇప్పటి వరకు పన్నుల వసూళ్లపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరం పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.88.89 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ. 32.57 కోట్లు మాత్రమే వసూలయ్యాయని పేర్కొన్నారు.
వంద శాతం వసూళ్ల లక్ష్యంగా ముందుకుపోవాలని సూచించారు లక్ష్యాన్ని సాధించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. వన్ టైం సెటిల్మెంట్ స్కీంపై బకాయిదారుల్లో అవగాహన కల్పించి అపరాధ రుసుములో 90 శాతం రాయితీ పొందేలా చూడాలని పేర్కొన్నారు. వంద శాతం గృహాలకు జియో ట్యాగింగ్ చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, డిప్యూటీ కమిషనర్లు జోనా, శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ మేనేజర్ రమేశ్, ఆర్వోలు సుదర్శన్, శ్రీనివాస్, యూసుఫొద్దీన్, షహజాదీ బేగం, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
నగరంలో కొనగసాగుతున్న పనులు సకాలంలో పూర్తి చేయాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీ ణ్య అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్లోని ఎంహెచ్‌నగర్, నజరత్పుర, 20వ డివిజన్లోని తిలక్‌రోడ్, 14వ డివిజన్లోని సాయిగణేశ్నగర్లో నిర్మిస్తున్న అం తర్గత రోడ్లను ఆమె పరిశీలించారు. అనంతరం 3వ డివిజన్ ఆరెపల్లి, కొత్తపేట, పైడిపల్లిలో ప్రతిపాదిత అభివృద్ధి పనుల ప్రదేశాలను పరిశీలించారు.