వీధి వ్యాపారుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో మేయర్ గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి శనివారం స్వనిధి మహోత్సవ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరోనా కష్టకాలంలో వీధి వ్యాపారులకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిందని గుర్తుచేశారు.
నగర వ్యాప్తంగా 47,800 మంది వీధి వ్యాపారులను గుర్తించి, 27 వేల మందికి రూ. 10 వేల చొప్పున రుణాలు అందించి జీడబ్ల్యూఎంసీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండడం అభినందనీయమన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని కోరారు.
నయీంనగర్, జూలై 30 : వీధి వ్యాపారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో స్వనిధి మహోత్సవ్‌ను శనివారం నిర్వహించారు. నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో చిరువ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరుకులను అందించడం సంతృప్తినిచ్చిందని అన్నారు. మహానగరంలోని వీధి వ్యాపారులతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని వివరించారు. నగర వ్యాప్తంగా 47,800 మంది వీధి వ్యాపారులను గుర్తించి 27 వేల మందికి రూ. 10 వేల చొప్పున రుణాలు అందించి జీడబ్ల్యూఎంసీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండడం అభినందనీయమని అన్నారు.
రుణాలే కాకుండా చిరువ్యాపారులకు శాశ్వత చిరునామా కల్పించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన 3 కోట్ల రూపాయలతో వీధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ కేంద్రాల్లో వీధి వ్యాపారులు సగర్వంగా వ్యాపారం చేసుకునే వీలు కలుగుతుందని అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. వ్యాపారంతో పాటు పిల్లల చదువుపై దృష్టి సారించాలని, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కోరారు.
వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని చెప్పారు. హక్కులతో పాటు బాధ్యతగా వ్యవహరించాలని ఆయ న సూచించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన బ్యాంకర్లు, వీధి వ్యాపారులను ఘ నంగా సన్మానించారు. వీధి వ్యాపారులు ఏర్పా టు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు.
వీధి వ్యాపారులు ఆర్థికంగా ఎదగాలి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్వనిధిని అమలు చేశామని మేయర్ గుండు సుధారాణి అన్నారు. దేశంలోనే పది లక్షల జనాభా కలిగిన నగరాల్లో మొదటి విడుత అధిక మొత్తంలో 10 వేల రూపాయల చొప్పున రుణాలు అందించి జీడబ్ల్యూఎంసీ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో చిరువ్యాపారులకు మరిన్ని రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పారు.
డిజిటల్ పేమెంట్‌లో కూడా వరంగల్ నగర వ్యాపారులు ముందంజలో ఉన్నారని వివరించారు. ఈ సందర్భంగా కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కేంద్ర ప్రభుత్వ మేనేజర్ జ్యోతి, వరంగల్ అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, మెప్మా అడ్మిషన్ కోఆర్డినేటర్ కృష్ణచైతన్య, బాలకిషన్, అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ భద్రునాయక్, సెక్రటరీ విజయలక్ష్మి, ఉప కమిషనర్లు జోనా, శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు, బల్దియా అధికారులు, సిబ్బంది, మెప్మా టీఎంసీలు, డీఎంసీలు, టీఎల్ఎఫ్లు, సీవోవోలు, వీధి వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
– మేయర్ గుండు సుధారాణి