వరంగల్, జూలై 1 : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం డాక్టర్స్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వివిధ వృద్ధ్దాశ్రమాలు, అనాథ శరణాలయాలు, వికలాంగుల సంక్షేమ కేంద్రాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, సేవలందించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో డాక్టర్ సాంబశివరావు సన్మానించారు.
అసంక్రమిత వ్యాధుల నియంత్రణలో విశేష కృషి చేసిన సిద్ధాపూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేశ్, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం డాక్టర్ రణధీర్‌కు శాలువాలు కప్పి, సర్టిఫికెట్లు అందజేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమశ్రీ, డాక్టర్ వాణి, డాక్టర్ గీతాలక్ష్మి, మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, యాదగిరి, ఎస్వో ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
గిర్మాజీపేట : వరంగల్ టీఎన్జీవోస్ మెడికల్, హెల్త్ ఫోరం సభ్యులు, డీపీవో అర్చన ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రపంచ డాక్టర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ డీఎంహెచ్వోలు వెంకటరమణ, సాంబశివరావు, వరంగల్ అడిషనల్ డీఎంహెచ్‌వో సుధార్‌సింగ్, ప్రోగ్రాం ఆఫీసర్లు చల్లా మధుసూదన్, గోపాల్‌రావును ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
భీమదేవరపల్లి : మండలంలో డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ములుకనూరు ప్రభుత్వ దవాఖాన ఆవరణలో వైద్యసిబ్బంది మొక్కలు నాటారు. హోమియో వైద్యాధికారిణి గీతారాణి, వైద్యసిబ్బంది రాజేశ్వర్‌రెడ్డి, మల్లీశ్వరి, వేణు పాల్గొన్నారు.
హసన్‌పర్తి : గ్రేటర్ 66వ డివిజన్ హసన్‌పర్తిలో ఫ్రెండ్స్ సొసైటీ అధ్యక్షుడు చకిలం రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ డాక్టర్ సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. సత్యనారాయణ ప్రముఖ వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గౌరిశెట్టి కృష్ణమూర్తి, కొడెల సుధాకర్, సహాయకార్యదర్శి అనుగాం సతీశ్, కోశాధికారి వెల్లటి రాజిరెడ్డి, సలహాదారులు పాపిశెట్టి శ్రీధర్, గోపరాజు యాదగిరి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కాజీపేట : కాజీపేట రైల్వే పాలిక్లినిక్‌లో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ ఎంఎస్ డాక్టర్ నిరంజన్ రావు, డాక్టర్లు నరేందర్, హరిబాబు, నరేశ్, ధీరజ్‌కుమార్, మాధవరావు తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్యక్షుడు కాలువ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివన్నారు. కార్యక్రమంలో ఆల్ బ్రాంచీల కోఆర్డినేటర్ నాయిని సదానందం, అనుమాల శ్రీనివాస్, రవీందర్, సాయికుమార్, సమ్మయ్య, రాజు, కార్మికులు పాల్గొన్నారు.
నయీంనగర్ : నిట్‌లో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. రిజిస్ట్రార్ గోవర్ధన్‌రావు, వరంగల్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ పులి రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం నిట్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న డాక్టర్లను సన్మానించారు. కార్యక్రమంలో వేణువినోద్, శ్రీనాథ్, సచిన్, ప్రదీప్, కార్తీక్, రవికుమార్, కేశవరావు, సురేశ్‌బాబు, ప్రకాశ్‌చారి, వినోద్, లోక్‌నాయక్, విదీశ్ చౌహాన్, బాలాజీ, శరత్ పాల్గొన్నారు.