ములుగు, జూన్ 24 (నమస్తే తెలంగాణ రెడోకో చైర్మన్‌గా ఏరువ సతీశ్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ఇతర మంత్రులు మహమూద్‌అలీ, జగదీశ్వర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తాతా మధు, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, దానం నాగేందర్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న హాజరయ్యారు. సతీశ్‌రెడ్డిని సన్మానించి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ములుగు జిల్లా ములుగు మండలం దేవగిరిపట్నానికి చెందిన సతీశ్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా జిల్లా నుంచి టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు భారీగా తరలివెళ్లారు.
టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్‌గా కొనసాగిన తనకు సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెడ్కో చైర్మన్‌గా నియమించారని ఏరువ సతీశ్‌రెడ్డి అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తన వంతు పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. పార్టీని పటిష్టం చేయడంతోపాటు సోషల్ మీడియా వారియర్స్‌కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. ములుగు జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కరిస్తానని పేర్కొన్నారు.