రోడ్లు ఊడుస్తూ.. చెత్త తీస్తుండడంతో పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా మారుతున్నాయి. ‘పల్లె, పట్టణప్రగతి’ ముమ్మరంగా సాగుతున్నది. సోమవారం పదకొండో రోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా వార్డులు, కాలనీల్లో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
అధికారులు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో ఎమ్మెల్యే రాజయ్య పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి క్రీడాకారులతో కబడ్డీ, వాలీబాల్ ఆడారు. జనగామలో జరుగుతున్న ‘పట్టణ ప్రగతి’ పనులను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, మున్సిపల్ చైర్మన్ పోకల జమున, కమిషనర్ నోముల రవీందర్‌తో కలిసి పరిశీలించారు.
స్టేషన్ ఘన్పూర్, జూన్ 13 : అభివృద్ది, సంక్షేమ పథకాల అమలుతోపాటు ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా సోమవారం మండలంలోని నమిలిగొండలోని పల్లె ప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి క్రీడాకారులతో కలిసి కబడ్డీ, వాలీబాల్ ఆడారు. సర్పంచ్ డ్యాగల ఉప్పలస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు.
క్రీడాకారుల కోసం గ్రామాల్లోనే క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎంపీటీసీ రజాక్ యాదవ్ కోరిక మేరకు రూ.5 లక్షలతో కమ్యూనిటీ హల్, రూ.5 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో రాంరెడ్డి, జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖా గట్టయ్య, తహసీల్దార్ పూల్‌సింగ్ చౌహాన్, ఎంపీడీవో కుమారస్వామి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, మండల ప్రత్యేకాధికారి నర్సయ్య, ఎంపీవో సుధీర్‌కుమార్, విధ్యుత్ శాఖ ఏడీఈ పాపిరెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి ప్రభాకర్, ఉప సర్పంచ్ రామచంద్రం, పంచాయతీ కార్యధర్శి జేసుమని, గ్రామ అధ్యక్షుడు కోల హరికృష్ణ పాల్గొన్నారు.
మండలంలోని శివునిపల్లిలో రూ.16 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే రాజయ్య ప్రారంభించారు. పంచాయతీ సెక్రటరీ చిరంజీవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఆఫీస్ ఇన్చార్జి ఆకుల కుమార్, ఎంపీడీవో కుమారస్వామి, తహసీల్దార్ పూల్‌సింగ్ చౌహన్, ఎంపీటీసీలు బూర్ల లతాశంకర్, గుర్రం రాజు, వార్డు సభ్యుడు బూర్ల విష్ణు, సొసైటీ డైరెక్టర్ తోట సత్యం, మార్కెట్ డైరెక్టర్ చిగురు సరిత, మార్కెట్ వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి, జొన్నల సోమేశ్వర్, గుర్రం శంకర్, గుర్రం ఏసుబాబు, గుర్రం శ్రీనివాస్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
బచ్చన్నపేట : మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమం సోమవారం జోరుగా కొనసాగింది. మన ఊరు- మనబడి కింద చేపట్టిన పనులను ప్రారంభించడంతో పాటు, పనులు శరవేగంతో సాగుతున్నాయి. ప్రతీ గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాల స్థలాల ఎంపిక. మైదానం ఏర్పాటు పనులు జోరందుకున్నాయి. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్న సర్కార్ ఆదేశంతో ఆ శాఖ అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. కార్యక్రమంలో జనగామ డీఈ సదానందం, ఎంపీడీవో రఘురామకృష్ణ, పీఆర్ ఏఈ శ్రీనివాస్, ట్రాన్స్‌కో ఏఈ సత్తయ్య, నాగేందర్, సిబ్బంది తిరుపతి, శ్యాంసుందర్, దీనయ్య పాల్గొన్నారు.
పాలకుర్తి : మండల కేంద్రంతోపాటు లక్ష్మీనారాయణ పురం, తీగారం గ్రామాల్లో సోమవారం పల్లెప్రగతి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లోని రహదారుల వెంట కాలనీల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించి చెత్తాచెదారాన్ని తొలగించారు.ఈ సందర్భంగా ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జడ్పీఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పస్నూరి నవీన్‌కుమార్ మాట్లాడుతూ మారుమూల పల్లెలను సైతం ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృషితో గ్రామాలు అన్ని రంగంలో అభివృద్ధి చెం దుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో.జడ్పీకో-ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్ పాల్గొన్నారు.
జనగామ చౌరస్తా : ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం జనగామలో జోరుగా కొనసాగుతున్నది. 10వ రోజు 9, 17, 23, 24, 25, 28, 29, 30వ వార్డుల్లో చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ పనులను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునాలింగయ్య, మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్ పర్యటించారు. వార్డులోని రోడ్లను శుభ్రం చేయించడంతో పాటు సర్కారు తుమ్మ, జిల్లేడు, వయ్యారిభామ చెట్లను తొలగింపజేయించారు. ఆయా వార్డుల్లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడానికి వీలుగా ఉన్న చోట గుంతలు తీయించారు. అక్కడక్కడ ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలు తొలగింపజేయడం, మట్టి కుప్పలను తీసివేయించారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. ‘బడిబాట’లో భాగంగా పట్టణ కేంద్రంలోని కొత్తబస్తీ యూపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలపై అదనపు కలెక్టర్ అబ్దుల్‌హమీద్ విద్యార్థులకు వివరించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, ఆయా వార్డుల కౌన్సిలర్లు ముస్త్యాల చందర్, జక్కుల అనిత వేణుమాధవ్, గంగరబోయిన మల్లేశ్, ఊడ్గుల శ్రీలత రమేశ్, సమద్, ముస్త్యాల దయాకర్, బొట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
సోమవారం పట్టణంలోని 30 వార్డుల్లో స్థానిక వార్డు కౌన్సిలర్లు, వార్డు స్పెషల్ ఆఫీసర్లు కలిసి రోడ్డు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించారు. తడి, పొడి చెత్తపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. 1వ వార్డులో స్థానిక వార్డు కౌన్సిలర్ రామగల్ల అరుణ విజయ్ కుమార్, 2వ వార్డు కౌన్సిలర్ వాంకుడోతు అనిత, 3వ వార్డు కౌన్సిలర్ పగిడిపాటి సుధ సుగుణాకర్‌రాజు, 4వ వార్డు కౌన్సిలర్ మంత్రి సుమలత, 5వ వార్డు కౌన్సిలర్ దేవరాయ నాగరాజు, 6వ వార్డు కౌన్సిలర్ వంగాల కల్యాణి, 7వ వార్డు కౌన్సిలర్ ఎం అరవింద్‌రెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ తాళ్ల సురేశ్‌రెడ్డి, 10వ వార్డు కౌన్సిలర్ ఎన్ లక్ష్మి, 11వ వార్డు కౌన్సిలర్ పాక రమ, 12వ వార్డు కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మి, 13వ వార్డు కౌన్సిలర్ మల్లిగారి చంద్రకళ, 14వ వార్డు కౌన్సిలర్ పేర్ని స్వరూప, 15వ వార్డు కౌన్సిలర్ మారబోయిన పాండు, 16వ వార్డు కౌన్సిలర్ గాదెపాక రాంచందర్, 18వ వార్డు కౌన్సిలర్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి, 20వ వార్డు కౌన్సిలర్ జూకంటి లక్ష్మి శ్రీశైలం, 21వ వార్డు కౌన్సిలర్ కర్రె శ్రీనివాస్, 22వ వార్డు కౌన్సిలర్ బాల్దె కమలమ్మ, 27వ వార్డు కౌన్సిలర్ హరిశ్చంద్రగుప్తా ఆధ్వర్యంలో రోడ్డు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.