పాలకుర్తి రూరల్, జూన్ 13: నియోజకవర్గంలోని ప్రతి చెరు వునూ గోదావరి జలాలతో నింపడమే తన ధ్యేయమని, ఆ దిశ గా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. సోమవారం పాలకుర్తిలోని మంత్రి క్యాంప్ కార్యాలయం లో దేవాదుల అధికారులు, ప్రజాప్రతినిధులు, భూములు కో ల్పోతున్న రైతులతో సమీక్ష నిర్వహించారు. ఎర్రబెల్లి చారిటబు ల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగురాలు లక్ష్మికి ట్రై సైకిల్ అందజే శారు.
మండలంలోని తొర్రూరు జేలో నిర్వహించిన బొడ్రాయి ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని మహిళల తో కలిసి బోనమెత్తారు. ఈ సందర్భంగా మంతి ఎర్రబెల్లి మా ట్లాడుతూ రాబోయే రోజుల్లో 365 రోజులు గోదావరి జలాలు పారిస్తానని అన్నారు. పాలకుర్తి, చెన్నూరు, ఉప్పగల్లు చెరువుల ను రిజర్వాయర్లుగా మార్చానన్నారు. రిజర్వాయర్ కాల్వ పను లకు భూములు కోల్పోతున్న రైతులు సహకరించాలన్నారు. భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తామని చెప్పారు. అధికారులు భూ సేకరణ పనులు వేగంగా చేపట్టాలన్నారు. ప నులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ భాస్కర్రావు, ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దా ర్లు స్వప్న, బీ పాల్సింగ్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పు స్కూరి శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసు నూరి నవీన్, తమ్మడపల్లి ఎంపీటీసీ శివయ్య, యాదగిరి, రాజు, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముస్కు రాంబాబు, టీఆ ర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, మార్కెట్ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల ఆశోక్రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ మదా ర్, చెన్నూరు సర్పంచ్ పుస్కూరి పార్వతి, మేడా రపు సుధాకర్, కారుపోతుల వేణు, కళింగరావు, సర్పంచ్ నాయిని మ ల్లారెడ్డి, ఎంపీటీసీ మడిపెల్లి కౌసల్య, పీఏసీఎస్ చైర్మన్ గోనె మైసిరెడ్డి, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ వీరమనేని యాకాం తారావు, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వెనుకదాసుల రాంచం ద్రయ్య శర్మ, ఎండీ అబ్బాస్, గొటుకుల సోమనాథం, శివరాజు, చిలువేరు చిన్న పెంటయ్య, పసులాది సోమనర్సయ్య, శంకర్, యాకస్వామి, పులి ఏలేంద్ర, చిదిరాల సుజాత పాల్గొన్నారు.
కొడకండ్ల: మండలంలోని రామన్న గూడెం గ్రామంలో జరిగిన దుర్గమ్మ పండుగ వేడుకలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని బోనమెత్తారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ ధరావత్ జ్యోతి, జడ్పీటీసీ కేలోత్ సత్తెమ్మ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ, రాష్ట్ర ఈజీసీ సభ్యుడు అందె యాకయ్య పాల్గొన్నారు.