మహబూబాబాద్, జూన్ 13 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పేర్కొన్నారు. మానుకోట నియోజకవర్గంలోని బేతోల్ గ్రామానికి చెందిన సంతోష్, మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో పొలిశెట్టి సంపత్, పట్టణానికి చెందిన పిల్లి సుధాకర్‌కు కేటాయించిన దళితబంధు పథకం ద్వారా వచ్చిన రూ.10లక్షలతో టెంట్ హౌస్‌లను ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం మూడు టెంట్ హౌస్‌లను మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ప్రారంభించి మాట్లాడారు.
దళితుల బతుకుల్లో నిండైన వెలుగులు నింపేందుకే ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేశారని తెలిపారు. టెంట్‌హౌస్‌ల ద్వారా వచ్చే ఆదాయంతో ఉజ్వల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, సీనియర్ నాయకుడు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, ప్రధాన కార్యదర్శి గోగుల రాజు, ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్దన్, పట్టణ యూత్ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్‌రెడ్డి(వైఎంఆర్), వార్డు కౌన్సిలర్ సూర్నపు సోమయ్య, దాసరి రావీశ్, డోలి సత్యనారాయణ, కామ సంజీవరావు, బుజ్జి వెంకన్న, విజయమ్మ, రఫిక్, రాజ్‌కుమార్, రామకృష్ణ, కొండ్ర ఎల్లయ్య, నీలేశ్రాయ్, జన్ను నవీన్, నాయకులు, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.