వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సకల వసతులను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది నుంచే ఆంగ్లమాధ్యమంలో బోధన ప్రారంభిస్తున్న నేపథ్యంలో సర్కారు బడుల్లో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. తొలిరోజు విద్యార్థుల రాకతో పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొన్నది. కొత్త విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలు అందించి స్వాగతం పలికారు.
ప్రభుత్వ బడిలో భారీగా నూతన అడ్మిషన్లు కొనసాగుతున్న బడిబాట
తొర్రూరు, జూన్ 13 : మన బస్తీ-మన బడిలో భాగంగా పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదాద్దారు. హెచ్ఎం గుంటుక యాకయ్య విద్యార్థులకు పూలు ఇచ్చి స్వాగతించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంగ్టిష్ మీడియం ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సీహెచ్.హైమావతి, ఏ విమలాదేవి, సోమేశ్వర్, రోజారాణి, రేణుక, విద్యార్థులు పాల్గొన్నారు.
చిన్నగూడూరు : బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని ఎంపీడీవో శ్యాంసుందర్, హెచ్ఎం రహమాన్ అన్నారు. బడిబాటలో భాగంగా మండల కేంద్రంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. దాశరథి సెంటర్లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయరాజు, నాగేశ్వర్రావు, సతీశ్, సత్యం, సురేశ్, శ్రీనివాస్‌రెడ్డి, రేణుకాదేవి, శ్రీనివాస్, సతీశ్‌కుమార్, సోని, పుష్పలీల,విద్యార్థులు పాల్గొన్నారు.
పెద్దవంగర: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, బొమ్మకల్లు హైస్కూల్ హెచ్ఎం రహమన్ అన్నారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు.
దంతాలపల్లి : రెండేళ్ల తర్వాత పాఠశాలలు ప్రారంభమవడంతో పెద్దముప్పారం గ్రామంలో ఎంపీడీవో గోవిందరావు, గన్నెపల్లిలో సర్పంచ్ వెంకటనారాయణ, దంతాలపల్లిలో ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పువ్వులు అందజేసి స్వాగతం పలికారు.
నర్సింహులపేట: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధాన గేట్‌కు కొబ్బరిఆకులు, బెలూన్లు కట్టి విద్యార్థులకు స్వాగతం పాలికారు. హెచ్ఎం మాట్లాడు తూ ఆంగ్ల మాధ్యమంలో బోధించనున్నట్లు తెలిపారు.
నెల్లికుదురు : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలలను తోరణాలు, బెలూన్లతో అలంకరించారు. మేచరాజుపల్లి హైస్కూల్లో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి విద్యార్థులకు పూలు అందజేసి స్వాగతం పలికారు. ఎర్రబెల్లిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఎంఈవో గుగులోత్ రాము బడిబాట కరప్రతాలు ఆవిష్కరించారు.
గంగారం: మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమవడంతో విద్యార్థులకు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. రేపల్లెవాడ గిరిజన ప్రాథమిక మోడల్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, లక్ష్మీనర్సు పాల్గొన్నారు.
బయ్యారం: మండలంలోని పలు గ్రామాల్లో పాఠశాలలు ప్రారంభమవగా వైస్ ఎంపీపీ తాత గణేశ్ సందర్శించారు. కంబాలపల్లి, బీమ్లాతంగా, రెడ్యాతండా పాఠశాలలను సందర్శించారు.
డోర్నకల్: మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్, యూపీఎస్, ప్రాథమిక పాఠశాలను ఎంఈవో పూల్‌చంద్ తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య పెంచాలని, మధ్మాహ్న భోజనం మెనూ అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
కేసముద్రం: మండలంలోని నర్సింహులగూడెం పాఠశాలలో విద్యార్థులకు గులాబీ పూలు అందజేసి స్వాగతించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్‌సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ్‌పాండ్యన్, పంచాయితీ కార్యదర్శి మంజుల, హెచ్ఎం కొడిపాక రమేశ్, ఉపాధ్యాయురాలు సునీత పాల్గొన్నారు.