మహబూబాబాద్, జూన్ 13 : జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ కే శశాంక పేర్కొన్నారు. సోమవారం నర్సింగ్ కాలేజీ పనులను అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. కళాశాల ఆవరణలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్‌ను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అనంతరం నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లతో ల్యాబ్, నిర్మాణం, ఫర్నీచర్ ఏర్పాటుపై చర్చించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ జే వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ దనాజియాదవ్, ఆర్అండ్బీ ఈఈ తానేశ్వర్, ఏఈ సందీప్, కాంట్రాక్టర్ సంపూర్ణారావు ఉన్నారు. అదేవిధంగా జువైనల్ హోమ్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులను నాణ్యతగా చేపట్టాలని, డైనింగ్ హాల్, కిచెన్ పనులను పరిశీలించి సూచనలు చేశారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలతా లెనీనా, పంచాయతీరాజ్ ఈఈ సురేశ్ తదితరులు ఉన్నారు.
నర్సింహులపేట: మండలంలో కొత్తగా ఏర్పాటైన ఫకీరతండా, రామన్నగూడెం జీపీల్లో సోమవారం కలెక్టర్ శశాంక పర్యటించారు. ఫకీరతండాలో రోడ్లపై బురద, నర్సరీలో మొక్కలు ఎండి పోవడంపై పంచాయతీ కార్యదర్శి సాగర్, సర్పంచ్ శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామన్నగూడెంలోని నర్సరీ, వైకుంఠధామం బాగున్నాయని సర్పంచ్ నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి సాయిని అభినందించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండడంపై హెచ్ఎంను అడిగి తెలుసుకున్నారు. బాడిబాటలో భాగంగా ఈ నెల 31లోపు విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి సూపర్ వైజర్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా పని చేయని వారిపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, డీపీవో సాయిబాబా, ఎంపీపీ టేకుల సుశీల, యాదగిరెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎండీడీవో, సత్యనారాయణరెడ్డి, సర్పంచులు బొడపట్ల నర్సయ్య, శంకర్‌నాయక్, ఎంపీటీసీ జీ రవి, ఎంపీవో సోంలాల్, ఏపీవో భూపాల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు సాయి, సాత్విక్, సాగర్ ఉన్నారు.