డోర్నకల్, జూన్ 13: సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యా నాయక్ అన్నారు. సోమవారం మండలంలోని బొడ్రాయి తండాలో తెలంగాణ క్రీడాప్రాంగణం ప్రారంభానికి వచ్చిన ఆయనకు సర్పంచ్ తేజావత్ గమ్మి రాజు ఘన స్వాగతం పలికారు. అనంతరం వాలీబాల్, ఖోఖో క్రీడా మైదానాలను ప్రారంభించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో మొత్తం 20 జీపీలు మంచి గ్రామ పంచాయతీలుగా గుర్తింపు పొందగా, అందులో 19 జీపీలు తెలంగాణ రాష్ట్రంలోనివే ఉన్నాయన్నారు. జీపీలకు కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని జీపీలకు బిల్లులు చెల్లించిందన్నారు.
బీజేపీ నాయకుడు బండి సంజయ్‌ది దొంగ బుద్ధి అని, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి పనులను విమర్శించే హక్కు విపక్షాలకు లేదన్నారు. బొడ్రాయితండాలో రూ. 1.4 కోట్లతో ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు, రైతుబంధు కింద 318 మంది రైతులకు ప్రతి ఏడాది రూ.10 వేలు చొప్పున రూ.1975 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఐదు కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బొడ్రాయితండాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, జీపీ నిర్వహణ విధానాన్ని చూసి సర్పంచ్ తేజావత్ గమ్మి రాజు, ఎంపీడీవో అపర్ణ, కార్యదర్శి ప్రవీణ, ఉప సర్పంచ్ భాస్కర్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ ధరంసోత్ బాలూనాయక్, జడ్పీటీసీ పొడిశెట్టి కమలారామనాథం, మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ ఎంపీపీ తుమ్మ వెంకట రెడ్డి, మాజీ జడ్పీటీసీ జీ సత్తిరెడ్డి, ఉపసర్పంచ్ టీ భాస్కర్, తహసీల్దార్ వివేక్, ఏపీఎం శంకర్‌నాయక్, కార్యదర్శి ప్రవీణ, పీహెచ్సీ వైద్యాధికారి ప్రణవి, ఎంపీవో మున్వర్‌బేగ్, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బీ నందనాయక్, నాయకుడు పీ రామనాథం పాల్గొన్నారు.
చిన్నగూడూరు: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మండలంలోని గుండంరాజుపల్లి గ్రామానికి చెందిన దొంతు వెంకన్న, సత్తయ్య, సుశీల స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు దొంతు నవీన్ స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్, పెన్నులు పంపిణీ చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేను స్థానికులు, ఉపాధ్యాయులు సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. నోట్‌బుక్స్ పంపిణీ చేసిన నవీన్‌ను ఎమ్మెల్యే అభినందిదంచారు. తహసీల్దార్ రామకృష్ణ, టీఆర్ఎస్ మండల నాయకులు ఎం మురళీధర్‌రెడ్డి, సర్పంచ్ సలీమ, డీ స్టాలిన్, సాగర్, సృజన్, హెచ్ఎం ఎల్లారెడ్డి, ఎంఎస్సీ చైర్మన్ కే శ్రీను, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.