జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం పండుగలా కొనసాగుతున్నది. సోమవారం పదకొండో రోజు ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రగతి పనులను పరిశీలించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. అందరూ సమష్టిగా పని చేసి పల్లెల రూపురేఖలను మార్చుకుంటున్నారు. దుగ్గొండి మండలంలోని గిర్నిబావి, చాపలబండ గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికతో పాటు పారిశుధ్య, పలు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. కాగా, జీపీల్లో పారిశుధ్య పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పించారు.
దుగ్గొండి, జూన్ 13 : పల్లెప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ తెలిపారు. సోమవారం మండలంలోని గిర్నిబావి, చాపలబండ గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు గ్రామస్తులతో కలిసి గ్రామంలో పల్లెప్రగతి అవగాహన ర్యాలీ నిర్వహించి, గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పారిశుధ్య పనులను, అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీదర్గౌడ్, గిర్నిబావి, చాపలబండ గ్రామాల సర్పంచ్లు కూస సమతారాజు, ఏడెల్లి రజితాఉమేశ్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజు, స్రవంతి పాల్గొన్నారు.
గీసుగొండ: పల్లె ప్రగతితో గ్రామాలు శుభ్రంగా తయారవ్వాలని అదనపు కలెక్టర్ హరి సింగ్ సూచించారు. మండలంలోని సూర్యతండా గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో సోమ వారం అయన పాల్గొని పల్లె ప్రగతిలో తీర్మానం చేసుకున్న పనుల వివరాలను అడిగి తెలుసు కోవడంతో పాటు గ్రామంలో పర్యటించి, పలు సూచనలు చేశారు. పల్లె ప్రగతిలో జీపీ పాలకవర్గాన్ని భాగస్వామ్యం చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల సంఖ్య పెంచాలని అయన సూచించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ వీ రజిత, కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఎంపీడీవో అంబటి సునీల్కుమార్రాజ్ సూచించారు. సోమవారం మండలంలోని రాములునాయక్తండా, గురిజాల, ముగ్ధుంపురం, రాజపల్లి, పర్శనాయక్ తండా, ఇటుకాలపల్లి, పాతముగ్ధుంపురం, లక్నెపల్లి, జీజీఆర్పల్లి గ్రామాల్లో పల్గె ప్రగతిలో భాగంగా జీపీ సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. నాగుర్లపల్లి, మాధన్నపేట గ్రామాల్లో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో పరిశీలించి, పలు సూచనలు చేశారు. సర్పంచ్లు మాధవి, మమత, జ్యోతి, భాగ్యమ్మ, గాంధీ, రవీందర్, లావ ణ్య, రాంబాబు, కోమల, కార్యదర్శులు, కారోబార్లు ఉన్నారు.
నల్లబెల్లి: పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని ఎంపీవో కూచన ప్రకాశ్ అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కా ర్యాలయంలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను ఎంపీవో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం కావడంతో అన్ని గ్రామాల్లో అధికారులు. ప్రజాప్రతినిధులు, జీపీ సి బ్బంది పాఠశాలల్లో పచ్చదనం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామ ప్రత్యేక అధికారి అభిదలి పాల్గొన్నారు.
నెక్కొండ: పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని అలంకానిపేట, వెంకటాపురం గ్రామాల్లో సోమవారం సీజనల్ వ్యాదులపై పంచాయతీ పాలకవర్గం, వైద్యసిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటా తిరుగుతూ బురదగుంటలు పూడ్చుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా తీసుకోవాల్సిన చర్యలు, సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో సర్పంచ్ ఎం అనంతలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీటీసీ కర్పూరపు శ్రీనివాస్, వార్డుమెంబర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురంలో ప్లాస్టిక్ సేకరించడంతో పాటు రోడ్లపై గుంతలను పూడ్చారు. పారిశుధ్య పనులను చేపట్టారు. ఎన్ఆర్ఈజీఎస్లో రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమార్, రవీందర్రావు పాల్గొన్నారు.
రాయపర్తి: మండలంలోని 39 గ్రామ పంచా యతీల పరిధిలో 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం మండల కేం ద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారికి ఇరు వైపులా కాల్వలను సర్పంచ్ గారె నర్సయ్య శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నర్సయ్య మాట్లాడుతూ గ్రామాలలోని ప్రజలందరి స్వచ్ఛంద సహకారంతోనే గ్రామాలను పూర్తి స్థాయిలో పారిశుధ్య నిలయాలుగా మార్చవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గుగులోత్ అశోక్నాయక్, కారోబారు కే రాంచంద్రయ్య, మైనొద్దీన్, పీ రమేశ్, పల్లె అభిషేక్, రాజు తదితరులు పాల్గొన్నారు.
గీసుగొండ: పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని జడ్పీటీసీ పోలీసు ధర్మారావు సూచించారు. మండలంలోని కోనాయిమాకులలో పలె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ర్యాలీ తీశారు. అనంతరం గ్రామ పూర వీధులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ ప్రభుత్వం పల్లె ప్రగతితో గ్రామాలను అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచు డోలి రాధబాయి, ఉప సర్పంచ్ రమేశ్, ఎంపీవో మోహన్రావు, సూపర్వైజర్ కల్యాణి, వార్డు సభ్యులు,స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
గిర్మాజీపేట: పట్టణ ప్రగతి పనులు పలు డివిజన్లలో కొనసాగాయి. సోమవారం 26వ డివిజన్లో పట్టణప్రగతి కార్యక్రమాలను కార్పొరేటర్ బాలిన సురేశ్ పరిశీలించారు. అనంతరం స్థానికుల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపల్ అధికారులకు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సోమవతి విజయభారత్, ప్రధాన కార్యదర్శి రాజేంద్రచారి, దుర్గేశ్వరస్వామి దేవాలయ చైర్మన్ ఎలకంటి సతీశ్, ధర్మకర్త కూచన రమేశ్, రేపూడి భాస్కర్, పోలెపాక సీతయ్య, ఎండీ మహబూబ్, ఎండీ ఖాజా, రేపూడి కిశోర్, మేడూరి శ్రీకాంత్, ఏఈ సతీశ్, ఆర్పీలు పద్మశ్రీ, సరిత, రాణి, వాణి, భాగ్యశ్రీ, గీత, విజయ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నా రు.
25వ డివిజన్లో టీఆర్ఎస్ ముఖ్యనాయకులు బస్వరాజు శ్రీమాన్ ఆధ్వర్యంలో డివిజన్లోని 14-1 బ్లాక్లో చేపట్టిన పట్టణప్రగతి పనుల్లో ఇంటింటా వెళ్లి సర్వే చేసి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కా ర్యక్రమంలో మున్సిపల్ అధికారులు, డివిజన్ కమిటీ సభ్యులు, ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే, 33వ డివిజన్ కార్పొరేటర్ ఎం అరుణాసుధాకర్ ఆధ్వర్యంలో డివిజన్లోని శ్మశానవాటికలో పట్టణప్రగతి పనులను నిర్వహించారు. టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, యూత్ సభ్యులు, ఆర్పీలు, అంగన్వాడీటీచర్లు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
కరీమాబాద్: పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని అధికారులకు కార్పొరేటర్లు సూచించారు. సోమవారం 32, 39, 40, 41, 42 డివిజన్లలో కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన, వరంగల్ మహానగరపాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్లలోని సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.