ఖానాపురం, జూన్ 13: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చదివించాలని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు అన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని బుధరావుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంపీపీ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు హాజరు పట్టీకను పరిశీలించారు. ఎంత మంది విద్యార్థులు పాఠశాలకు వచ్చారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం మెరుగైన వసతులను కల్పిస్తున్నందున ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బడిబాటలో విద్యార్థుల నమోదు పెంచాలన్నారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని సర్పంచ్ పెండ్యాల జ్యోతి సూచించారు. సోమవారం మండలంలోని పలు ప్రభు త్వ పాఠశాలల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహించారు. మండలంలోని ముగ్ధుంపురం యూపీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని సర్పంచ్ జ్యోతి, కమ్మపల్లిలో సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి ప్రారంభించారు. ఇటుకాలపల్లి, దాసరిపల్లి, ముత్తోజిపేట, లక్నెపల్లి, మహేశ్వరం గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శోభన్‌బాబు, ఎస్కే సర్ధార్, సీఆర్పీలు శ్రీనివాస్, రవీందర్, సునీల్, ఉపాధ్యాయులు తదితరులున్నారు.
ఖానాపురం: మండలంలోని నాజీతండాలో సోమవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బాలకిషన్, హెచ్ఎం జేతురాంనాయక్, పంచాయతీ కార్యదర్శి బాలు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు డప్పు వాయిద్యాలతో ఇంటింటికి తిరిగారు. పలువురు విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. అదేవిధంగా హెచ్ఎం జేతురాంనాయక్ తన సొంత డబ్బులతో 60 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది.ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరి నాణ్యమైన విద్యను పొందాలని హెచ్ఎం కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి, సదు పాయాలను సద్వినియోగం చేసుకోవాలని 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత రాజుయాదవ్ సూచించారు. దేశాయిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రచార కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ షరీఫ్, అహల్య, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.