పోచమ్మమైదాన్, జూన్ 13 : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 13వ డివిజన్లోని దేశాయిపేటలో సోమవారం పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేటర్ సురేశ్‌కుమార్ జోషి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నదన్నారు.
ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే అభివృద్ధి పనులు సంపూర్ణంగా జరుగుతాయన్నారు. అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. కాలనీల్లో ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా ప్రజల సమస్యలపు పరిష్కరించాలన్నారు. వర్షాకాలంలో ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జన్ను దయాకర్, ఎంకే బాబు, మధుకర్, మంద సురేశ్, ఉదయ్, రాజేందర్, బాబా, యాకూబ్, బియాబానీ, రాజు, మేరీ తదితరులు పాల్గొన్నారు.