మరిపెడ, జూన్ 8: బడీడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ శశాంక సూచించారు. మండలంలోని గాలివారి గూడెం, తానంచర్ల గ్రామాల్లో, మరిపెడ మున్సిపాలిటీలో పల్లె, పట్టణ ప్రగతి పనులను అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్‌తో కలిసి పరిశీలించా రు. ఈ సందర్భంగాకలెక్టర్ శశాంక మాట్లాడుతూ అంగన్ వాడీ కేంద్రాల్లో గర్భిణులకు ప్రసవం అయ్యేవరకు పౌష్టి కాహారం అందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ప్రసవాల ను ప్రోత్సహించాలని అన్నారు. గాలివారిగూడెం గ్రామం లో అంగన్వాడీ కేంద్రంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడంపై ఐసీడీఎస్ సూపర్వైజర్కు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో పారిశుధ్యం సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పా రిశుధ్యం లోపిస్తే ప్రజారోగ్యంపై ప్రభావం ఉంటుందని అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. నర్సరీ, పల్లెపకృతి వనం బాగుందని కలెక్టర్ సర్పంచ్ రామయ్యను ప్రశంసిం చారు. వైకుంఠదామంలో సౌకర్యాలు మెరుగుపరచాల న్నారు. తానంచర్ల గ్రామంలో గ్రామీణ క్రీడామైదానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని యువత క్రీడా ప్రాంగణాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గ్రా మంలో నెలకొన్న సమస్యలపై స్థానిక సర్పంచ్ దిగజర్ల శ్వేతాముఖేష్ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగై న పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పల్లె ప్రగతి నిర్వహిస్తుందన్నారు. శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న మ రిపెడలో పట్టణ ప్రగతి ద్వారా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలన్నా రు. రోడ్లపై వ్యర్థాలు వేస్తే జరిమానా విధించాలని సూ చించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ పా ఠశాలలోని క్రీడామైదానం పనులు పూర్తి చేయాలని శిథి లావస్థలో ఉన్న భవంతులను కూల్చివేయాలన్నారు.
పట్ట ణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మున్సిపాలిటీ పాలక మండలి, అధికారులకు ఆయన సూచించారు. కార్యక్ర మంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ సింధూరకుమారి, ఎంపీ పీ గుగులోత్ అరుణ, జడ్పీటీసీ శారద, పశుసంవర్ధకశాఖ అధికారి సుధాకర్, ఆర్డీఓ రమేశ్, డిప్యూటీ సీఈఓ నర్మద, ఎంపీడీవో ధన్సింగ్, తహసీల్దార్ రాంప్రసాద్, ఎన్పీ డీసీ ఎల్ ఏఈ వంశీ, ఐసీడీఎస్ సీడీపీఓ శిరీష, దిగజర్ల ముఖే ష్, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు రావుల వెంకటరెడ్డి, పానుగోతు సుజాత, పరశురాములు, చిన భిక్షం, ప్రగతి, హథీరాం, వెంకటేశ్వర్లు, స్రవంతి, భద్రయ్య పాల్గొన్నారు.