ఖానాపురం, జూన్ 8 : గ్రామాల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. బుధవారం మండలంలోని బుధరావుపేటలో ‘మన ఊరు-మనబడి’ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, ధర్మరావుపేట, కొత్తూరు, మంగళవారిపేట పాఠశాలల అభివృద్ధి పనులను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. పాఠశాలలు బాగుంటేనే విద్యార్థులు చేరుతారన్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని, నిర్బంద ఉచిత విద్య రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. దేశం లో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలకంటే తెలంగాణ అభివృద్ధి పథంలో ముందున్నదన్నారు.
ఈ సందర్భంగా నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాల కోసం రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని తండాలకు వందశాతం సీసీ, లింకు రోడ్లు మంజూరు చేసి సకాలంలో పూర్తి చేసే లా చర్యలు తీసుకుంటామన్నారు. బుధరావుపేట అంగన్వాడీ భవన మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపించాలని కోరారు. రూ.10 లక్షలు తన సీడీఎఫ్ నిధుల నుంచి కేటాయిస్తున్నట్లు తెలిపారు. మంగళవారిపేట భూ సమస్యలను ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. అవసరమైతే కోర్టు ద్వారా పోరాటం చేస్తామన్నారు.
మిగిలిన సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. గ్రామస్థాయిలో సమస్య లు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎం పీపీ వేముల ప్రకాశ్‌రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, వైఎస్ ఎంపీపీ రామసహాయం ఉమ, అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.