గూడూరు, జూన్4: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయని, వాటినే కేంద్రం సైతం అమలు చేస్తున్నదని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. శనివారం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని నాయకపల్లి, తీగలవేణి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పల్లెలు దేశానికి పట్టుకొమ్మల్లా మారాయని, బాపూజీ కన్న కలలు నేడు సీఎం కేసీఆర్ సాధ్యం చేశారని తెలిపారు. కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అగ్రగ్రామిగా ముందుకు దూసుకెళ్లుతున్నదన్నారు.
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, ప్రకృతి వనం, చెరువుల పునరుద్ధరణ, డ్రైనేజీల శుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టి గ్రామాలను అందంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. అనంతరం గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ సుజాతామోతీలాల్, తహసీల్దార్ అశోక్, ఎంపీడీవో విజయలక్ష్మి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖాసీం, సర్పంచులు వీ శైలజామోహన్రెడ్డి, ఎం శశిరేఖాపద్మనాభరెడ్డి, ఎం లక్ష్మణ్‌రావు, ఎంపీటీసీ వీ వాసూదేవరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీ వెంకటకృష్ణారెడ్డి, నాయకులు సంపత్‌రావు, కఠార్‌సింగ్, ఎం రవి, ఎం శోభన్‌బాబు పాల్గొన్నారు.
మహబూబాబాద్ రూరల్ : పల్లెలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్‌తో కలిసి మండలంలోని ముడుపుగల్, అయోధ్య గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామసభల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో కనీస మౌలిక వసతులు ఏర్పాడ్డాయన్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ పైపులైన్ వేసి నేడు గ్రామాల్లో తాగునీరు అందిస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ విద్యుత్, విద్య, తాగునీరు, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
2018 పంచాయతీ రాజ్ చట్టం ద్వారా ప్రతీ జీపీకి ఒక సెక్రటరీ ఏర్పాటు చేసి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో అన్ని రకాల వసతులను సమకూర్చుకున్న సర్పంచ్ యాస రమ, పంచాయతీ సెక్రటరీలకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం గ్రామంలోని నర్సరీ, వైకుంఠధామాలు, జీపీ భవనాన్ని పరిశీలించారు. బడిబాటలో భాగంగా సంకి రక్షితకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ యాస రమ, ఎంపీపీ భూక్యా మౌనిక, జడ్పీటీసీ ప్రియాంక, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ యాస వెంకటరెడ్డి, డీపీవో సాయిబాబా, పీడీ సన్యాసయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, హరిప్రసాద్, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.