ఎల్కతుర్తి, ఏప్రిల్ 24: బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని గురువారం వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పరిశీలించారు. సభలో చేపడుతున్న ఏర్పాట్లు, బారికేడ్లు, హెలీప్యాడ్, వీఐపీ, ఇతరుల వాహనాల పార్కింగ్ రూట్లు, ప్రధాన వేదిక తదితర విషయాలను ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, నాగుర్ల వెంకన్న తదితర నేతలు సీపీకి వివరించారు.
ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ రూట్లతోపాటు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుకోవాలని సీపీ వారికి సూచించారు. పోలీసులు తమ సహకారాన్ని అందిస్తారని, వలంటీర్లతో కలిసి ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చూస్తామని సీపీ తెలిపినట్లు సమాచారం. సభాస్థలికి సంబంధించిన రూట్‌మ్యాప్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సురేశ్, ఏఆర్ ఏసీపీ అనంతయ్య, కాజీపేట ఏసీపీ తిరుమల్, డివిజన్ పోలీసు అధికారులు ఉన్నారు.