Tuberculosis Eradication Day | ఘనంగా ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం
Tuberculosis Eradication Day | క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యాధికారిణి రూబీనా అన్నారు.
భీమదేవరపల్లి, మార్చి 24: క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యాధికారిణి రూబీనా అన్నారు. భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో సోమవారం ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులతో కలిసి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్షయ వ్యాధిని నిర్మూలించాలని ప్ల కార్డులతో నినాదాలు చేస్తూ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రుబీనా మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండాలన్నారు.
ఈ వ్యాధి సోకిన వారు దగ్గినా, తుమ్మినా గాలి ద్వారా ఇతరులకు వ్యాధి సోకే ప్రమాదం ఉందన్నారు. నిరంతరంగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, అలసట, రాత్రివేళ చెమట వంటివి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు రెహమాన్, రాజశేఖర్, సిబ్బంది వాణి, మోహన్, ఏఎన్ఎం స్వరూప, పీవీ రంగారావు బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ స్వరూప, హారిక, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

