Warangal : ఎల్వీఆర్ నగర్‌ని మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతా.. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

వరంగల్ చౌరస్తా : వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఎల్వీఆర్ నగర్‌ని మోడల్ కాలనీగా తీర్చి దిద్దుతానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన చిన్నతనంలో ఎల్వీఆర్నగర్ వాసులు పడిన ఇబ్బందులను ఆయన గుర్తు చేస్తూ నాటి ఇబ్బందులు నేటితరం పడకూడదన్న ఆశయంతో ఎల్వీఆర్ నగర్‌కు అన్ని మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. తాను సైతం పేదరికంలో పుట్టి పెరిగానని, అద్దె ఇంటి కష్టాలను సైతం అనుభవించానని గుర్తు చేశారు. తాను మేయర్గావున్న సమయంలోనే ఎల్వీఆర్ నగర్ వాసులు తనను కలిసి వారి కష్టాలను తెలియజేశారని, వెంటనే అధికారులతో మాట్లాడి మోడల్ కాలనీగా మార్చడానికి చేపట్టాల్సిన చర్యలను చేపట్టాలని ఆదేశించానన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని నాటికి నేటికి ప్రజల కష్టాలను తీర్చడానికి కేసీఆర్, కేటీఆర్‌ల అడుగుజాడల్లో ముందుకు నడుస్తామన్నారు.
మేయర్‌గా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని ఆయన అన్నారు. త్వరలోనే అన్ని ఇళ్లకు కరెంటు మీటర్లు, రోడ్డు సౌకర్యాలు, మురుగునీటి కాల్వ నిర్మాణాలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ రమేశ్, దుబ్బ శ్రీనివాస్, చిలుక రాజు, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

