ఖిలావరంగల్, ఏప్రిల్ 9 : వరంగల్ రైల్వేస్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ అమయ్‌కుమార్ గుప్తా సందర్శించారు. శనివారం ప్రత్యేక రైలు ద్వారా వరంగల్‌కు చేరుకున్న ఆయన ముందుగా సులభ్ ఇంటర్నేషనల్, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సులభ్ డీలక్స్ పబ్లిక్ టాయిలెట్స్‌కు భూమి పూజ చేశారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. రైల్వేస్టేషన్ ఎదుట ఉన్న కార్, ఆటో పార్కింగ్ స్థలాలు, యార్డు, ట్రాక్‌ను పరిశీలించారు. మూడో లైన్ పనులను వీక్షించారు. సికింద్రాబాద్ తర్వాత అత్యంత ప్రధాన్యత కలిగిన వరంగల్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పక్కాగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, రైల్వే కూలీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డీఆర్ఎంకు వినతిపత్రం అందజేశారు. మజ్దూర్ యూనియన్ చైర్మన్ ముకుందం ఆధ్వర్యంలో ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు.
అనంతరం డీఆర్ఎంను రైల్వే గూడ్స్ షెడ్డు హమాలీ యూనియన్ గౌరవాధ్యక్షుడు, మాజీ డిప్యూటీ మేయర్ కక్కె సారయ్య, జడ్ఆర్యూసీసీ సభ్యుడు చింతాకుల సునీల్, 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ సన్మానించారు. కార్యక్రమంలో సీడీఎం మనోజ్, సీనియర్ డీసీఎం బస్వరాజ్, సీనియర్ డీఈఎన్ కృష్ణారెడ్డి, ఏడీఈఎన్ కాజీపేట శ్వేత పన్వార్, స్టేషన్ మేనేజర్ శ్రీనివాస్, సీసీఐ స్వామి, సీటీఐ వెంకటేశ్వర్లు, హెచ్ఐ మీనా, ఆర్పీఎఫ్ సీఐ టీఎస్ఆర్ కృష్ణ, ఎస్సైలు రాజేంద్రప్రసాద్, ప్రజ్ఞా, జీఆర్పీ ఎస్సై పరశురాములు పాల్గొన్నారు.