Warangal : ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి.. జిల్లా కలెక్టర్ గోపీ

ఖిలావరంగల్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. గురువారం వరంగల్ జిల్లా కలెక్టర్ చాంబర్లో నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు నియమించిన నోడల్ అధికారులు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వహించలన్నారు. పోలీంగ్ స్టేషన్ల బాధ్యతను జెడ్పీ ఈసీఓ రాజారావుకు, మెటీరియల్ మేనేజ్మెంట్కు నోడల్ అధికారిగా ఇండస్ట్రీ జీఎం నరసింహమూర్తి, మాడల్ కోడ్ అమలు పర్యవేక్షణకు నరేష్కుమార్, కౌంటింగ్ ఇన్చార్జి, అబ్జర్వర్ల కోసం ఆర్డీఓ మహేందర్‌జీ, మీడియా సర్టిఫికేషన్ కమిటీ ఇన్చార్జిగా డీపీఆర్ఓ పల్లవి, మెటీరియల్ కొనుగోలు, టీఏ, డీఏ చెల్లింపు బాధ్యతలను ఏఓ రాజేంద్రనాథ్, కోవిడ్-19 నిబంధనలు సరిగా అమలు చేసేందుకు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, వాహనాల ఏర్పాటుకు ఆర్డీఓ ఆఫ్రీన్సిద్దిఖీలను నోడల్ అధికారులుగా కలెక్టర్ నియమించారు.
పూర్తి కో-ఆర్డినేషన్‌తో నోడల్ అధికారులు అందరూ ఎన్నికల్లో తమ విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, నోడల్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఓయూ, కేయూ వర్సిటీల పూర్వ విద్యార్థుల జాతీయ భావజాల సమ్మేళనానికి ఆహ్వానం’
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

