వర్ధన్నపేట : వర్ధన్నపేట మున్సిపల్ కేంద్రంలోని సామాజిక ప్రభుత్వ దవాఖానలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. దవాఖాన సూపరింటెండెంట్ డా. నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని హరిపిరాల గ్రామానికి చెందిన గద్దల స్పందన ప్రసవం కోసం దవాఖానలో చేరింది. బుధవారం స్పందనకు పురిటి నొప్పులు రావడంతో డాక్టరు మానసారెడ్డి, పిడియాట్రీషన్ డాక్టరు తిరుపతిరెడ్డి ఇద్దరు కలిసి ఆపరేషన్ చేయగా స్పందన ఐదు కేజీల బరువున్న బాబుకు జన్మనిచ్చినట్లు వారు తెలిపారు.
తల్లీ బిడ్డలు ఇరువురూ క్షేమంగా ఉన్నారని వివరించారు. కాగా ప్రతీ వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే ఇటువంటి వారు పుడుతారని పెర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యరోగ్య సిబ్బంది దివ్య, సునంధ, భాస్కర్ పాల్గొన్నారు.