హనుమకొండ చౌరస్తా, జూలై 20: భారత రాష్ర్ట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమ స్ఫూర్తితో కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో 22,23,24 తేదీలలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని బీఆర్ఎస్వీ సీనియర్ నాయకులు, మాజీ కేయూ జాక్ చైర్మన్ కత్తెరపల్లి దామోదర్ తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ క్యాంటీన్ ప్రాంగణంలో బీఆర్ఎస్వీ ఇంచార్జి జెట్టి రాజేందర్, జిల్లా కో-ఆర్డినేటర్ అరూరి రంజిత్, రాష్ర్ట నాయకులు కలకోట్ల సుమన్, కందికొండ తిరుపతితో కలిసి కేటీఆర్ జన్మదిన కార్యక్రమ వివరాలను ఆయన సోమవారం ప్రకటించారు.
22వ తేదీన పండ్ల పంపిణీ కార్యక్రమం, 23న గ్రీన్ ఇండియా ఛాలెంజ్, 24వ తేదీన కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ విద్యార్థులకు పుస్తకాల బకరణ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాంకేతిక, పరిశ్రమల, ఉద్యోగ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మేటిగా నిలిపిన రాజకీయ దిగ్గజం కేటీఆర్ జన్మదినాన్ని వారి పిలుపుమేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని విద్యార్థి నాయకులు అన్నారు. త్వరలో రాష్ర్ట పార్టీ సూచనల మేరకు యూనివర్సిటీ బీఆర్ఎస్వీ కమిటీ ఏర్పాట్ల పరిశీలన జరుగబోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు కొనుకటి ప్రశాంత్, పిన్నింటి విజయ్‌కుమార్, నల్లతీగల శ్రీకాంత్, దేవోజీ కచ్రోజీ పాల్గొన్నారు.