రెజోనెన్స్ జూనియర్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి : ఉప్పుల శివ
అనుమతులు లేని ప్రైవేటు జూనియర్ కళాశాలలకు కోమ్ముకాస్తున్న జిల్లా డిఐఈఓ దిష్టిబొమ్మని హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ జంక్షన్లో దహనం చేశారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 3: డెమొక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్(డీఎస్ఏ) హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనుమతులు లేని ప్రైవేటు జూనియర్ కళాశాలలకు కోమ్ముకాస్తున్న జిల్లా డిఐఈఓ దిష్టిబొమ్మని హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ జంక్షన్లో దహనం చేశారు. ఈ సందర్భంగా డీఎస్ఏ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ మాట్లాడుతూ హనుమకొండ నగరంలో ప్రభుత్వ నియమనిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నడుస్తున్న రేజోనెన్స్ జూనియర్ కాలేజీపై చర్యలు తీసుకోవాలని అనేకమార్లు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ బోర్డ్ అధికారికి వినతి పత్రాలు ఇచ్చిన స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.
జిల్లా కలెక్టర్‌కి ప్రజావాణిలో పలుమార్లు ఆధారాలతో సహా వినతిపత్రాలు సమర్పించిన అధికారుల నుంచి స్పందన రాకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులులేని ప్రైవేటు జూనియర్ కళాశాలలకు జిల్లా డిఐఈఓ వత్తాసు పలుకుతున్నారని, ఆయా కళాశాలలపై ఫిర్యాదులు చేసినా కనీసం తనిఖీలు చేయకుండా ప్రైవేట్ యాజమాన్యలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. నగరంలో సుమారు 9 రేజోనెన్స్ జూనియర్ కాలేజీలకు అనుమతులు లేవని, ఫైర్‌సేఫ్టీ, ఇతర ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా విద్యను వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం వెనక తాత్పర్యం ఏంటని వారు అధికారులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కమల్, వెంకటేష్, అభినయ్, గోవర్ధన్,సంపత్, శివరామ్, అమీర్ పాషా, జాషువా, రక్షిత్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
బడిలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ హెడ్మాస్టర్ : వీడియో
Stock Market | నేడూ కొనసాగిన బుల్ జోష్.. సెన్సెక్స్ వరుసగా రెండోరోజూ 1200 పాయింట్లు జంప్..!
గ్రామాల్లో పారిశుధ్య పనులపై డీపీఓ అనూష ఆకస్మిక తనిఖీలు
అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

