Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
Mandamarri to Moon | ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో, 'సింబ స్క్రీన్ స్టోరీస్' పతాకంపై ప్రవీణ్ మొలక నిర్మించిన వైవిధ్యమైన చిత్రం 'చంద్రయాన్'.
Mandamarri to Moon | ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో, ‘సింబ స్క్రీన్ స్టోరీస్’ పతాకంపై ప్రవీణ్ మొలక నిర్మించిన వైవిధ్యమైన చిత్రం ‘చంద్రయాన్’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ హిలేరియస్ అడ్వెంచర్ కామెడీ సినిమా నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా విడుదలకు ఇంకా 10 రోజులే ఉందంటూ కొత్త పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.
సమాజంలో తమని తక్కువ చేసి మాట్లాడిన వారి ముందు తమ ప్రతిభను నిరూపించుకోవాలని నలుగురు గ్రామీణ యువకులు నిర్ణయించుకుంటారు. ఎవరికీ అంతుచిక్కని ఆలోచనగా సొంతంగా ఒక రాకెట్ తయారు చేసి, ఏకంగా చంద్రమండలానికి వెళ్లాలని వారు సాహసించడం ఈ చిత్ర ప్రధానాంశం. మందమర్రి టూ చందమామ సాగే ఈ ప్రయాణం ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. శ్రీనాథ్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహించారు. ప్రవీణ్ మొలక నిర్మాతగా వ్యవహరిస్తుండగా, వేణు ఊడుగుల సమర్పిస్తున్నారు. శివకుమార్ దీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, ‘బలగం’ సత్యనారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు హర్ష ప్రవీణ్ సంగీతం అందించగా, ఆదిత్య మ్యూజిక్ ఆడియోను విడుదల చేసింది.
ఈ చిత్రానికి సంబంధించిన రాకెట్ రివీల్ ఈవెంట్‌ను ఇటీవల హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించగా, ప్రముఖ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇది పూర్తిగా ఒక హానెస్ట్ మరియు ఇన్నోసెంట్ అటెంప్ట్. భారత్ సత్తాను ‘చంద్రయాన్’ ప్రపంచానికి ఎలా చాటిందో, ఈ చిత్రం ద్వారా మన కుర్రాళ్ల ప్రతిభ ఇండస్ట్రీకి తెలుస్తుంది అని చిత్ర సమర్పకులు వేణు ఊడుగుల తెలిపారు. పూర్తి కుటుంబ సమేతంగా థియేటర్లలో నవ్వుకోవడానికి సిద్ధమైన ఈ ‘చంద్రయాన్’ రాకెట్ నవంబర్ 13న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
బడిలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ హెడ్మాస్టర్ : వీడియో
Stock Market | నేడూ కొనసాగిన బుల్ జోష్.. సెన్సెక్స్ వరుసగా రెండోరోజూ 1200 పాయింట్లు జంప్..!
గ్రామాల్లో పారిశుధ్య పనులపై డీపీఓ అనూష ఆకస్మిక తనిఖీలు
అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

