Stock Market | నేడూ కొనసాగిన బుల్ జోష్.. సెన్సెక్స్ వరుసగా రెండోరోజూ 1200 పాయింట్లు జంప్..!
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు మంగళవారం కూడా భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఎల్టీసీజీ ట్యాక్స్ (LTCG tax) మినహాయింపు ఉంటుందన్న అంచనాలతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. దీనికితోడు మన ఈక్విటీల్లోకి విదేశీ నిధుల ప్రవాహం కొనసాగడమూ కలిసొచ్చింది.
Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు మంగళవారం కూడా భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఎల్టీసీజీ ట్యాక్స్ (LTCG tax) మినహాయింపు ఉంటుందన్న అంచనాలతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. దీనికితోడు మన ఈక్విటీల్లోకి విదేశీ నిధుల ప్రవాహం కొనసాగడమూ కలిసొచ్చింది. దాంతో సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. వరుసగా నాలుగో సెషన్లోనూ సూచీలు రాణించాయి. సెన్సెక్స్ (Sensex) 1200 పాయింట్లపైకి ఎగబాకింది. నిఫ్టీ (Nifty) సైతం 23,800 మార్కును దాటింది.
సెన్సెక్స్ ఉదయం 76,288.65 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై రోజంతా లాభాల్లోనే కొనసాగింది. చివరికి ఇంట్రాడే గరిష్ఠాల వద్ద 1225.07 పాయింట్లు ఎగబాకి 76,917.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 370.05 పాయింట్లు పెరిగి 23,810.85 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30లో పవర్‌గ్రిడ్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, టాటాస్టీల్, ట్రెంట్ కంపెనీల షేర్లు తప్ప మిగతా కంపెనీల షేర్లన్నీ లాభపడ్డాయి. ముఖ్యంగా హిందుస్థాన్ యునిలీవర్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ధర 105.56 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. బంగారం ఔన్స్ ధర 3,906.19 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, భారత మ్యూచువల్ ఫండ్లకు ఊరట కల్పించేందుకు ఈక్విటీ ప్రతిఫలాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను రద్దు చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం విదేశీ మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది.
క్రితం రోజుతో పోలిస్తే ధర స్వల్పంగా పెరిగినప్పటికీ ఇటీవలి కాలంలో రికార్డుస్థాయి రేట్లతో పోలిస్తే ధరలు దిగిరావడం మార్కెట్‌కు కలిసొచ్చింది. భారత ఈక్విటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. సోమవారం కూడా రూ.3,115 కోట్ల మేర నిధులను మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. దీనికితోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పుంజుకోవడం, కార్పొరేట్ కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా రావడం సూచీలకు కలిసొచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | నేడూ కొనసాగిన బుల్ జోష్.. సెన్సెక్స్ వరుసగా రెండోరోజూ 1200 పాయింట్లు జంప్..!
గ్రామాల్లో పారిశుధ్య పనులపై డీపీఓ అనూష ఆకస్మిక తనిఖీలు
అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
‘శ్రీజ ఇండస్ట్రీస్ బియ్యం అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి’
Avengers: Doomsday | డాక్టర్ డూమ్ హవా: ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి కొత్త పోస్టర్లు విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

