హనుమకొండ చౌరస్తా, జూలై 28: తెలంగాణ ప్రభుత్వ కళాశాల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీజీటీఏ) జిల్లా కార్యవర్గాన్ని హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎం.రవికుమార్, జిల్లా కార్యదర్శి డీ.వెంకన్న, కోశాధికారిగా సుహాసిని, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎ.అశోక్, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు-1గా ఎస్.కిరణ్ ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో టీజీసీజీటీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే చిన్నా, రమేశ్ పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ ఎన్నికల ప్రక్రియకు యాకూబ్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ వ్యవహరించారు. సంఘం మనోభేదానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు అన్నారు.