హనుమకొండ, నవంబర్ 23 : చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో వరల్డ్హెరిటేజ్ వీక్ స్వచ్ఛత అభియాన్ క్లీనింగ్ డ్రైవ్ పర్యవేక్షణలో భాగంగా పురావస్తుశాఖ సిబ్బంది, దేవాదాయ శాఖ సిబ్బంది, స్వచ్ఛందంగా తరలివచ్చిన విద్యార్థులు దేవాలయాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా అజిత్ విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ను అనుసరించి పురావస్తుశాఖ సిబ్బందితో ప్రమాణ పత్రం చదివించారు.
ప్రమాణపత్రంలో టూరిజం, పురావస్తుశాఖ పరిధిలోగల కట్టడాలకు దేవాలయాలకు వచ్చే ప్రజలు ఎలాంటి గీతలు గీయకూడదని, ప్రకృతి సహజమైన వృక్షాలను ధ్వంసం చేయకూడదని, ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతరంపై ఉన్నదని, భారతీయ సాంస్కృతికి సంప్రదాయాలకు భవిష్యత్ తరాలకు అందించే ఈ ప్రాచీన కట్టడాలను చూసి తరించాలని పురావాస్తు శాఖ ప్రమాణపత్రంలో పేర్కొన్న అంశాలను విద్యార్థులతో ప్రమాణం చేయించారు.