ఐనవోలు( హనుమకొండ) : భక్తులు కోరిన కోర్కిలను తీర్చే కొంగు బంగారం ఐనవోలు(Iinavolu) మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం జాతర బ్రహ్మోత్సవాలు రేపు జరిగే ధ్వజారోహణతో ప్రారంభం అవుతాయి. రేపటి నుంచి ఉగాది వరకు సుమారుగా మూడు నెలల పాటు సుదీర్ఘ కాలం పాటు జాతర బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. జాతరకు వచ్చే భక్తుల సౌకార్యర్థం తాత్కలిక మరుగుదొడ్లు, మహిళలకు డ్రెస్ చేజింగ్ రూంలు, క్యూలైన్లలో తాత్కలిక మూత్రశాలు, దాతల సహకారంతో మల్లన్న సదన్‌లో మరో 14 అతి త్వరాలో రూమ్స్ అందుబాటులోకి రానున్నాయి. కుడా ఆధ్వర్యంలో ఆదనంగా రెండు ఐమాక్స్ టవర్ల ఏర్పాటుతో దేవాలయానికి కొత్త శోభ సంతరించుకున్నది.
ఐనవోలు మల్లన్న ఆలయ విశిష్టత..
ఈ పుణ్య క్షేత్రం వివరాలు తెలుసుకొవాలంటే రాష్ట్రకూటుల తర్వాత, చాళుక్యులు పాలనలోకి వచ్చారు. ఈ చాళుక్యుల సామంత రాజులుగా ఉన్న కాకతీయులు కాలక్రమంలో స్వతంత్ర రాజులుగా ఓరుగల్లు గడ్డను ఏలిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కూట రాజు కృష్ణ-2 పాలన కాలం 850 నుంచి 914 ఏళ్ల వరకు కొనసాంది. అంటే దాదాపు 1100 ఏళ్ల ముందు నుంచే ఐనవోలు ఉందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. కాల క్రమేన ఈ ప్రాంతంను వేలమ రాజులు పరిపాలన చేసినట్లుగా దేవాలయం వేల రాజుల కాలం వేసిన శిలాశాసం చెప్పుతుంది. ఇదే సామాజిక వర్గానికి చెందిన మార్నేని వంశస్తులు దేవాలయం నిర్వహణ బాధ్యతను కొనసాంచారు. కాల క్రమలంలో మార్నేని వంశస్తులు 1966 దేవాదాయశాఖలు అప్పంగిచారు.
గొల్లకుర్మలకు ఇలవేల్పు..
స్వామి వారి రూపం చాలా గంభిరంగా ఉంటుంది. సుమారుగా పది అడుగుల ఎత్తుతో విశాల నేత్రంలతో కోర మీసాలతో చతుర్భుజాలలో ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, పణపాత్రలతో కనపిస్తారు. ఇరువైపుల గొల్లకేతమ్మ, బలిజమేడలమ్మ కొలువు దీరి ఉంటారు. కుడి పాదం కింద మల్నన్న చేతిలో చనిపోయిన మాణిమల్లసూరుల శిరస్సులు కనిపిస్తాయి. కర్ణాటక పాంత్రంలో పుట్టుని ఖండేలురాయుడు కర్ణాటక నుంచి మహరాష్ట్ర వరకు పరిపాలించాడు. ఈయన ఇద్దరి భార్యలలో బలిజమేడల్లమ్మ కర్ణాకట ప్రాంత వాసి. రెండవ భార్య గొల్లకేతమ్మ మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన అమ్మవారి చెబుతారు. గొల్లకేత్మమ్మ మా ఆడపచును పెళ్లి చేసుకున్న కాబట్టి మల్లికార్జునస్వామిని వారి ఇలావేల్పుగా గొల్లకురుమ్మలు పసుపు బండారితో పూజిస్తారు.
భారీ సంఖ్యలో హాజరు కానున్న భక్తులు..
దేవాలయంలో సంక్రాంతి పర్వదినం నుంచి ఉగాది వరకు మూడు నెలలపాటు నిర్వహించే ఉత్సవాలకు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. మేడారం జాతర పురస్కరించుకొని గత జాతర కన్న ఈ సారి జాతరకు భక్తులు భారీ సంఖ్యలో హాజరుకాన్నున్నారు. ప్రధానంగా భక్తులు దేవాలయ ఆవరణలో విడిది చేసి బోగి, సంక్రాంతి రోజుల్లో బోనాలతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. బోనాల్లో నైవేద్యాన్ని ఎల్లమ్మ దేవతకు, స్వామి వారికి నివేదించడంతో పాటుగా పట్నాలు వేయడం దేవాయంలో అత్యంత ప్రధానమైన ఘట్టాలు. ఇందుకోసం దేవాలయ అధికారులు ఇప్పటికే ప్రాంగాణాన్ని పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు స్వామి వారి దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. దేవాలయం లోపల ఆవరణపై చలువ పందిళ్లు వేసి భక్తులు పట్నాలు వేసుకోవడానికి అనువుగా ఏర్పాట్లు చేశారు. శివసత్తుల పూనకాలు, వరంపట్టే మహిళలు, బగ్గు పూజారుల కోసం ప్రత్యేకంగా వసతులను కల్పించారు.
ఉగాది వరకు..
కోరిన వారి కోరిక్కలు తీర్చే కొంగు బంగారం ఐనవోలు మల్లికార్జునస్వామి. స్వామి వారి బ్రహ్మోత్సవాలు సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు కొనసాగుతాయి. సంక్రాంతి మూడు రోజుల ఉత్సవాలు రేపు ధ్వజారహణము కార్యక్రమంతో ప్రారంభం అవుతాయి. ధ్వజారోహణ రోజు స్వామి వారికి నూతన వస్త్రాలంకరణ, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనము, ధ్వజారోహణము, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మహానివేదన నీరాజన మంత్రపుష్పం తీర్థప్రసాదలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 13న మంగళవారం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం, 14న బుధవారం బోగి పండుగ, 15న గురువారం మరక సంక్రాంతి బండ్లు తిరుగుట, 16న శుక్రవారం కనుమ, 17న శనివారం మహాసంప్రోక్షణ సమారాదన, 23న శుక్రవారం భ్రమరాంభిక వసంతసంచమి, భ్రమరాంభిక అమ్మవారి త్రయోదశ వార్షికోత్సవము. ఫిబ్రవరి 01న ఆదివారం ఎల్లమ్మ దేవత పండుగ కార్యక్రమాలు ఉత్సవాలతో జరుగనున్నాయి.
భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు : ఈవో కందులు సుధాకర్
మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేయు భక్తులు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వ, దేవాలయ నిధులు, దాతల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అందరి సహయ సహకారలతో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం: కమ్మగోని ప్రభాకర్ గౌడ్ ఆలయా కమిటి చైర్మన్ ప్రముఖ శైవ క్షేత్రమైన ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయంలో మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు సంక్రాంతి నుంచి ఉగాది వరకు సుదీర్ఘంగా సాగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు రాష్ట్ర ప్రభుత్వం సకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం.