HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
HCA | కాకతీయ యూనివర్సిటీ మైదానంలో సోమవారం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) ఆధ్వర్యంలో అండర్-19 స్టేట్ లీగ్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు గుర్తింపులేదని, అందులో ఉన్నవారందరూ జైలుకు పోయారని గుర్తుచేశారు.
HCA | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 12: టీ షర్ట్, క్రికెట్ కిట్స్ అమ్ముకునే కంపెనీ వాళ్లను అంబటి రాయుడు సెలక్టర్లుగా పెట్టుకుని రంజీ ట్రోఫీకి క్రీడాకారులను ఎంపిక చేశాడని, ఒక్క తెలంగాణ క్రికెట్ ప్లేయర్ లేకుండా ఎలా ఎంపిక చేస్తావని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారం గురువారెడ్డి ప్రశ్నించారు. జీవన్‌రెడ్డి సెక్రటరీ ఎలా అయ్యాడని, అంబటి రాయుడు, జీవన్‌రెడ్డి డబ్బులు తీసుకుని, వారికి దగ్గరి వాళ్లను రంజి ట్రోఫీకి ఎంపిక చేశారని ఆయన మండిపడ్డారు. కాకతీయ యూనివర్సిటీ మైదానంలో సోమవారం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) ఆధ్వర్యంలో అండర్-19 స్టేట్ లీగ్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు గుర్తింపులేదని, అందులో ఉన్నవారందరూ జైలుకు పోయారని గుర్తుచేశారు. అంబటి రాయుడు, జీవన్‌రెడ్డి ఎంపిక చేసిన రంజి ట్రోఫీ క్రీడాకారులపై చాలా ఫిర్యాదు వస్తున్నాయని, వెంటనే ఆ టీంను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకుని క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారని, దమ్ముంటే చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. హెచ్‌సీఏ హైదరాబాద్‌కే పరిమితమైందని, కేవలం హైదరాబాద్ వారిని మాత్రమే ఎంపిక చేస్తుందన్నారు. తెలంగాణ క్రికెటర్ల భవిష్యత్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సుప్రీంకోర్టు కూడా టీసీఏతో కలిసి పనిచేయాలని సూచించినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు.
బీసీసీఐ గుర్తింపు కోసం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కొట్లాడుతుందన్నారు. బీసీసీఐ నుంచి వచ్చే డబ్బులు అక్కడే ఖర్చు అవుతున్నాయని, హెచ్‌సీఏ బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయించామన్నారు. డబ్బులు తీసుకొని సెలెక్ట్ చేస్తున్నారని, వేల మంది క్రికెటర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. 32 జిల్లాల నుంచి ఈసారి రంజి ట్రోఫీకి తెలంగాణ నుంచి టీంలు పంపిస్తామని, ఎవడు అడ్డుకుంటాడో చూస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణలోని ప్రతి గ్రామీణ క్రికెటర్‌ను ఎంపిక చేస్తామని, అవసరమైతే వేల మందితో బీసీసీఐ వద్ద ధర్నా చేస్తామని గురువారెడ్డి హెచ్చరించారు.
కేవలం హైదరాబాద్ క్రీడాకారులకే ప్రాధాన్యం..
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి మాట్లాడుతూ.. హెచ్‌సీఏ తెలంగాణ రాష్ర్టంలోని ఇతర జిల్లాల క్రికెట్ క్రీడాకారుల ప్రతిభను గుర్తించడంలో విఫలమైందని, క్రీడాకారుల ఎంపికలో ప్రతిభకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, డబ్బులు, పేరు ప్రతిష్ఠలకు ప్రాధాన్యం ఇస్తూ ఎంపికలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేవలం హైదరాబాద్ క్రీడాకారులకే ప్రాధాన్యం ఇస్తోందని, ఇతర జిల్లాల యువ క్రికెటర్లకు తగిన అవకాశాలు కల్పించడం లేదన్నారు.
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి సరైన శిక్షణ, అవకాశాలు కల్పిస్తూ రంజీ ట్రోఫీతోపాటు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించేస్థాయికి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్లలో ప్రతిభను గుర్తించి, వారికి మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ లీగ్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు, వారం రోజులపాటు కేయూ మైదానంలో జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో 18 జట్లు పాల్గొన్నాయని ఆయన వెల్లడించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి ఎంపికల కోసం బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు. టీసీఏ జోనల్ కన్వీనర్ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి జైపాల్‌రెడ్డి, కోచ్ షఫి, కురెళ్ల నాగేందర్ పాల్గొన్నారు.
Read Also :
Kalvala Project | కన్నీటి మడుగులా ‘కల్వల ప్రాజెక్ట్’..!.. మూడేళ్లుగా మరమ్మతులకు పడని అడుగులు
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

