Dogra Front | లష్కరే ఉగ్రవాది ఎన్కౌంటర్.. జమ్ముకశ్మీర్‌లో డోగ్రా ఫ్రంట్ సంబురాలు.. Video
Dogra Front | లష్కరే తోయిబా ఉగ్రవాది (LeT Terrorist) లతీఫ్ భట్ (Lateef Bhat) భద్రతాబలగాల చేతుల్లో హతమవడంతో జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో డోగ్రా ఫ్రంట్ (Dogra Front) సంబురాలు చేసుకుంటోంది. ఈ మేరకు జమ్ముకశ్మీర్ వీధుల్లో ర్యాలీలు నిర్వహించింది. ఈ ర్యాలీల్లో డోగ్రా ఫ్రంట్ సభ్యులు భద్రతాబలగాలకు జిందాబాద్‌లు కొడుతూ నినదించారు.
Dogra Front : లష్కరే తోయిబా ఉగ్రవాది (LeT Terrorist) లతీఫ్ భట్ (Lateef Bhat) భద్రతాబలగాల చేతుల్లో హతమవడంతో జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో డోగ్రా ఫ్రంట్ (Dogra Front) సంబురాలు చేసుకుంటోంది. ఈ మేరకు జమ్ముకశ్మీర్ వీధుల్లో ర్యాలీలు నిర్వహించింది. ఈ ర్యాలీల్లో డోగ్రా ఫ్రంట్ సభ్యులు భద్రతాబలగాలకు జిందాబాద్‌లు కొడుతూ నినదించారు. జమ్ముకశ్మీర్ పోలీస్ (JK Police) జిందాబాద్, సీఆర్పీఎఫ్ (CRPF) జిందాబాద్, బీఎస్ఎఫ్ (BSF) జిందాబాద్ అంటే నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా డోగ్రా ఫ్రంట్ అధ్యక్షుడు అశోక్ గుప్తా మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌లో యాక్టివ్‌గా ఉన్న ఏకైక స్థానిక లష్కరే ఉగ్రవాది లతీఫ్ భట్ హతమవడం తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. భట్ హతమార్చిన భద్రతాబలగాలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, కుల్గామ్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో లతీఫ్ భట్ హతమయ్యాడు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఫైనల్ రిపోర్టును ఆర్మీ వర్గాలు వెల్లడించనున్నాయి.
ఎన్కౌంటర్ సమయంలో భట్ దాచుకున్న మసీదుకు ఎలాంటి డ్యామేజ్ జరగలేదని భద్రతాబలగాలు వెల్లడించాయి. మోస్ట్ వాంటెడ్ లష్కరే ఉగ్రవాదుల్లో లతీఫ్ భట్ ఒకడిగా ఉన్నాడు. కశ్మీర్‌లోని స్థానిక యాక్టివ్ ఉగ్రవాది కూడా అతనొక్కడే. కుల్గామ్ ఎన్కౌంటర్ సైట్ నుంచి తప్పించుకున్న అతన్ని భద్రతాదళాలు వెంబడించాయి. జంగల్పురా గ్రామంలో ఆపరేషన్ సమయంలో లొంగిపోవాలని వీడియో కాల్ ద్వారా భద్రతా బలగాలు కోరాయి. కానీ లతీఫ్ నిరాకరించాడు.
ఈ నెల 11న సీఆర్పీఎఫ్ పోస్టుపై దాడి ఘటనలో దార్, భట్ ఇద్దరు నిందితులుగా ఉన్నారు. దార్‌ను సోమవారం నాడే భద్రతాబలగాలు మట్టుబెట్టగా, భట్ ఇవాళ హతమయ్యాడు. గడిచిన ఆరు నెలల నుంచి భట్‌కు ధార్ షెల్టర్ ఇచ్చారు.
#WATCH | Jammu, Jammu & Kashmir: Dogra Front members celebrate following the neutralisation of Lashkar-e-Taiba (LeT) commander Lateef Bhat by security forces in Kulgam
Dogra Front President Ashok Gupta says, “Security forces have avenged the Kulgam attack by eliminating the last remaining active local terrorist. Whenever the Indian Army, Border Security Force (BSF), Central Reserve Police Force (CRPF), or Police achieve a success, Congress questions it; the people of India will never forgive them.”
— ANI (@ANI) November 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dogra Front | లష్కరే ఉగ్రవాది ఎన్కౌంటర్.. జమ్ముకశ్మీర్‌లో డోగ్రా ఫ్రంట్ సంబురాలు.. Video
Robert Pattinson | రాబర్ట్ స్టార్ హీరో కనుకే తొలుత వ్యతిరేకించాం.. జేమ్స్ బాండ్ ఎంపికపై జెఫ్ బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jobs | నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో 145 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు
SIddipeta | సిద్దిపేటలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేసి కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలేస్తున్న సిబ్బంది.. వీడియో
Sonia Gandhi: పౌరసత్వం రాకముందే సోనియాకు ఓటు.. రిపోర్టు కోరిన ఢిల్లీ కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

