హనుమకొండ చౌరస్తా, జనవరి 17: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్‌కు మార్చి/ఏప్రిల్-2026 పరీక్ష ఫీజు గడువును పొగించారు. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ 2026 పరీక్షల ఫీజు చెల్లించేందుకు జనవరి 25 వరకు అవకాశమిచ్చామని ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం తెలిపారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం అభ్యాసకులు (ఆన్ లైన్) ప్రతి పేపర్‌కు రూ. 50 జరిమానాతో జనవరి 25వ తేదీ వరకు, తత్కాల్లో జనవరి 26వ తేదీ నుంచి జనవరి 28వ తేదీ వరకు www.telanganaopenschool.org ద్వారా ఆన్లైన్, మీసేవా కేంద్రాల్లో పరీక్షా రుసుం చెల్లిచాలని ఆయన కోరారు.