హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 9: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న టూడే లీగ్ పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు ఈనెల 11న(శనివారం) కరుణాపురం సమీపంలోని వంగపల్లిలోగల వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డబ్ల్యూడీసీఏ) మైదానంలో ఉదయం 10 గంటలకి నిర్వహించనున్నట్లు డబ్ల్యూడీసీఏ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
ఆసక్తిగల ఔత్సాహిక క్రికెట్ క్రిడాకారులు మీసేవ జారీ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఒరిజినల్ ఆధార్ కార్డులతో పాటు స్వంత క్రికెట్ కిట్, యూనిఫామ్లతో హాజరు కావాలని కోరారు.