Bachhannapeta | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం : ఎర్రోళ్ల విజయ
గ్రామంలో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని జనగామ జిల్లా పడమటి కేశవాపూర్ సర్పంచ్ ఎర్రల విజయ అన్నారు.
బచ్చన్నపేట ఫిబ్రవరి 23 : గ్రామంలో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని జనగామ జిల్లా పడమటి కేశవాపూర్ సర్పంచ్ ఎర్రల విజయ అన్నారు. సోమవారం గ్రామంలోని పెద్దమ్మ ఆలయం, పోచమ్మ ఆలయాల వద్ద భక్తులకు నీటి సౌకర్యం కోసం రూ.24,000 వెచ్చించి రెండు ట్యాంకులను నిర్మించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఐదేళ్లు నాణ్యమైన సేవలు అందించడమే నా జీవిత లక్ష్యం అన్నారు. తమపై ఉన్న నమ్మకంతో సర్పంచ్ గా గెలిపించి మరింత బాధ్యత పెంచారని అన్నారు.
గ్రామంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. ఆలయాల వద్ద భక్తులు పడుతున్న నేటి ఇబ్బందులను చూసి, తన సొంత ఖర్చులతో రెండు ఆలయాల వద్ద ట్యాంకులను నిర్మించామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దసలవారీగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజల సహకారం, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యుల సలహాలు సూచనలతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాడేం నరేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

