హనుమకొండ చౌరస్తా, మార్చి 25: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఆర్టీసీ డ్రైవర్ ఇలాసాగరం రవీందర్ కుటుంబానికి యూనియన్ బ్యాంక్ కోటి రూపాయల బీమా సొమ్మును అందజేసింది. ఆర్టీసీ ఉద్యోగులు యూనియన్ బ్యాంకులో నిర్వహిస్తున్న సూపర్ శాలరీ అకౌంట్ హోల్డర్లకు ప్రమాదంలో మరణిస్తే కోటి రూపాయల ఉచిత బీమా సదుపాయాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇలాసాగరం రవీందర్ హనుమకొండ బాలసముద్రం యూనియన్ బ్యాంకులో సూపర్ శాలరీ అకౌంట్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్ 21న మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో రవీందర్ మరణించారు. దీంతో యూనియన్ బ్యాంక్ రవీందర్ భార్య కవితకు కోటి రూపాయల బీమా సొమ్ము చెక్కును యూనియన్ బ్యాంక్ వరంగల్ రీజినల్ హెడ్ పలుగుల సత్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మహేష్, బ్యాంకు మేనేజర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.