హనుమకొండ (ఐనవోలు): మండల కేంద్రంలోని పులి చెరువులో బుధవారం ముదిరాజుల వలకు ఆరుదైన చేపలు చిక్కాయి. ఈ చేపలు సుమారుగా 150 నుంచి 250 గ్రాముల బరువు వరకు ఉన్న ఈ చేప చర్మంపై మచ్చలు, జీబ్రా మాదిరిగా తెలుపు, నలుపు చారలతో పాట కొమ్ములు ఉన్నాయి. అలాగే శరీరంపై పొడవాటి రెక్కలు, వెన్నుముక, తోక ఉన్నాయి.
దీన్ని శాస్త్రీయ నామం సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్థానికంగా దెయ్యం చేప అని పిలుస్తారు. ఇటువంటి చేపలు ఎక్కువ నీళ్లు ఉండే చెరువుల్లో, కాలువల్లో అరుదుగా ఉంటాయి. ఈ చేప తన సంతానాన్ని తక్కువ కాలంలోనే పదలు రేట్లు వృద్ది చెందుతుందన్నారు. ఈ వింత ఆరుదైన చేపను చూసిన ముదిరాజ్ కులస్తులు ఆశ్చర్యానికి గురైయ్యారు.