KCR | నర్సింహులపేట సెప్టెంబర్ 17: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్ర పటానికి గురువారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని గిరిజన గ్రామాల్లో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గుగగులోతు రవి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజనులకు న్యాయం చేసే విధంగా కేసీఆర్ 6 శాతం ఉన్న రిజర్వేషన్ 10 శాతానికి పెంచి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు.
అదేవిధంగా చిన్న చిన్న తండాలను సైతం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి తండాలకు వారే సర్పంచు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ కైల, ఉప సర్పంచ్ కిషన్ నాయక్. బీఆర్ఎస్ మండల అధ్యక్షుఉ మలోత్ వెంకన్న, వార్డు సభ్యులు రవి. కవిత ఉదయ్ లత రెడ్డి, శ్రీను మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ వీర నాయక్, తదితరులు పాల్గొన్నారు.