కాజీపేట, సెప్టెంబర్ 28 : కుల, మత అసమానత లు లేని సమ సమాజ నిర్మాణం కొరకు కలంతో పోరాటం చేసిన మహాకవి గుర్రం జాషువా యని కెవిపిఎస్ హనుమ కొండ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య అన్నారు. కాజీపేట పట్టణంలో మహాకవి గుర్రం జాషువా 130 వ జయంతి ని ఆదివారం ఘనంగా నిర్వహిం చారు. మహాకవి జాషువా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓరుగంటి సాంబయ్య మాట్లాడుతూ.. భారత దేశ సామాజిక, సాహిత్య రంగంలో జాషువా కవిత్వం ఓ చైతన్య స్ఫూర్తి అన్నారు.
కులమత బేధాలు పేదరికం తన గురువుగా భావిస్తున్నా నని చెప్పిన జాషువా వాటి మూలాల పై కలం యుద్ధం చేశాడన్నారు. కర్మ సిద్ధాంతము పేర కోట్లాది మంది కష్ట జీవులను అణిచివేత, దోపిడికి గురిచేసిన మనువాద విష సంస్కృతి పై మహోద్యమం నిర్మించాడని చెప్పారు. దేవుని గుడిలోకి ప్రవేశం లేని దళితుల గోడు వినిపించమని గబ్బిలం అనే రచన ద్వారా పంపిన సందేశం ఒక తిరుగు బాటు అన్నారు.
ప్రజలు, కెవిపిఎస్ నాయకులు, కార్య కర్తలు పీడిత వర్గాన్ని ఐక్యం చేసి పీడిత వర్గాన్ని దోచుకునే దోపిడీ అసమానతలపై పోరాడి జాషువా కలలుగన్న ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ కాజీపేట మండల నాయకులు తిక్క సాంబయ్య, రేఖ, రజిత, సునీత పాల్గొన్నారు.