బచ్చన్నపేట ఆగస్టు 31 : మైనర్లు వాహనాలు నడిపితే లక్ష జరిమానా విధిస్తామని నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామ పెద్దలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండని యువకులు వాహనాలు నడిపితే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అందులో భాగంగానే సమాచారం సేకరించెందుకు గాను వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా మైనర్లు ఆయా వాహనాలు నడిపినట్లు కనిపిస్తే ఆ గ్రూపులో పోస్ట్ చేయాలని సూచించారు.
గతంలో గ్రామాల్లో మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఎంతోమందికి ప్రమాదాలు జరిగాయని, పలువురు మృతి చెందిన సంఘటన కూడా ఉన్నాయని వెల్లడించారు. అందుకే గ్రామ క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు. ఇందుకు పోలీసులు కూడా సహకరించాలని వారు కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు తాతిరెడ్డి శశిధర్ రెడ్డి, బంగారు మహేష్, శ్రీరాముల కనకయ్య, గూడెంల నరసింహులు, శ్రీరాములు, కిష్టయ్య, గొల్లపల్లి మల్లేశం, సయ్యద్, రాజు, బాల కిషన్ పాల్గొన్నారు.