వరంగల్ : నగరంలోని కరీమాబాద్, దసరా రోడ్డు విస్తరణ పనులను కార్పొరేటర్లు, అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు.
రోడ్డు విస్తరణలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ రోడ్డు పనుల ఆవశ్యకత, ప్రజల్లో ఉన్న సందేహాలకు సమాధానమిస్తూ ప్రజలతో చర్చించారు.
వరంగల్ తూర్పు అభివృద్ధిలో భాగంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాల నిమిత్తం రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత పాటించాలని ఎమ్మెల్యే నరేందర్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు మరుపల్లి రవి, పల్లం పద్మ, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.